అవకాశాల కోసం అందరి దారి ఒకటైతే ఆమెదొకదారి

అంత ఘనమైన ట్రాక్ రికార్డు లేనప్పటికీ నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో హీరోయిన్ అవకాశం కొట్టేసింది బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ ఆమెకు అంతలా పేరు రాలేదు. గ్యాంగ్ లీడర్ మూవీ సైతం మిక్స్డ్ టాక్ తో చివరికి ప్లాఫ్ మూవీ గానే మిగిలిపోయింది. ఐదుగురు ఆడవాళ్ళతో హీరో నాని సాగించే ఎమోషనల్ రివేంజ్ జర్నీ కామెడీ వరకు పరవాలేదనిపించినా జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇక హీరోయిన్ ప్రియాంక కి ప్రత్యేకంగా పాత్ర లేకపోవడం ఆమెకు మైనస్ గా మారింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆమె హీరోయిన్ అయినప్పటికీ ఆ ఐదుగురు ఆడవాళ్ళలో ఒకరిగా ఆమె పాత్ర సాగుతుంది.

ఇక ప్రస్తుతానికి ఆమెకి చెప్పుకో దగ్గ ఆఫర్స్ ఏమీలేవు. గ్లామర్ రోల్స్ కి కూడా ఈ అమ్మడు దూరం కావడంతో అసలు అవకాశాలు రావడం లేదు. గ్లామర్ షో తో హాట్ హాట్ ఫోటో షూట్ లు చేసి ఆఫర్స్ పట్టేస్తున్న ఈ రోజుల్లో ప్రియాంక మాత్రం భిన్నంగా మాయన్ తెగ ప్రజల గెటప్ లో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. కెరీర్ కి ఉపయోగపడే ఫోటోలు కాకుండా ఇలాంటి ఫోటోలు పెట్టడం వలన ప్రయోజనం ఏమిటని జనాలు చెప్పుకుంటున్నారు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus