ప్రియాంకా అరుళ్ మోహన్ కు మరో బంపర్ ఆఫర్..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది.కాబట్టి.. హిట్లు లేకపోతే ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఆ తరువాత నుండీ ఆఫర్లు వస్తాయన్న గ్యారెంటీ ఉండదు. అందం, అభినయం ఉన్నప్పటికీ.. చాలా మంది హీరోయిన్లు ఇక్కడ కిందా మీదా పడుతున్న సందర్భాలను మనం చూస్తూ వస్తున్నాం. అయితే కొంత మంది హీరోయిన్లకు మాత్రం అవకాశాలు క్యూలు కడుతూనే ఉన్నాయి. గతంలో తమన్నా.. ఈ ప్లేస్ లో ఉండేది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈమెకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చేవి.

దానికి ముఖ్య కారణం ఆమె డెడికేషన్… హార్డ్ వర్క్ అని చాలా మంది దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా అలాగే దూసుకుపోతుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ఈమెకు శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ.. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఇది కూడా ప్లాప్ గానే మిగిలింది.

రెండు ప్లాప్ లు పడడంతో హీరోయిన్ ప్రియాంక పని ఇక అయిపోయినట్టే అని కొంతమంది కామెంట్లు చేశారు. కానీ ఈమెకు రామ్ – లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో అవకాశం వచ్చింది. ఇందులో మెయిన్ హీరోయిన్ గా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఎంపికైనప్పటికీ మరో హీరోయిన్ గా ప్రియాంక ను ఎంపిక చేశారట. ఈమె పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. అంతేకాదు నితిన్, నాని, వైష్ణవ్ తేజ్ , సాయి తేజ్ ల తరువాతి సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus