Priyanka Chopra: ప్రియాంక చోప్రా 40 వ పుట్టిన రోజు వేడుకలు..భర్తతో లిప్ లాక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఇప్పటి గ్లోబల్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం భర్తతో కలిసి వెకేషన్ లో ఉంది. అంతేకాదు తన 40వ పుట్టిన రోజు వేడుకలు చాలా ఘనంగా అదే సమయంలో రొమాంటిక్ గా జరుపుకుంది. జులై 18న ఆమె పుట్టి 40 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో ఓ బీచ్ రిసార్ట్ లో ఆమె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు భర్త నిక్ జోనస్.అనంతరం ఆ ఫోటోలను నిక్ జోనస్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

“80ల బేబీని” అనే ప్లే కార్డు పట్టుకున్న ఫోటోని ప్రియాంక చోప్రా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో ఇద్దరు బీచ్ వద్ద లిప్ లాక్ పెట్టుకున్న ఫోటో హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక ప్రియాంక చోప్రా ఈ మధ్యనే సరోగసి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కూతురుకి మాల్టీ మేరీ చోప్రా జోనస్ అనే పేరు పెట్టింది.

ఇక ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ ల వివాహం 2018లో జరిగిన సంగతి తెలిసిందే. నిక్ కంటే ప్రియాంక 10 ఏళ్ళు పెద్దది. ప్రియాంక ఇప్పుడు 40 లోకి ఎంట్రీ ఇస్తే, సెప్టెంబర్ లో నిక్ 30 లోకి అడుగుపెడతాడు.ఆమె బాలీవుడ్ చిత్రాలకు దూరమై చాలా రోజులు అయ్యింది.ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓ హాలీవుడ్ చిత్రం మాత్రం సెట్స్ పై ఉంది.సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ప్రియాంక చోప్రా బర్త్ డే పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus