Priyanka Chopra: ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్టుకు రూ.3కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్ ఇమేనా..!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీస్ మిగతా వారితో పోలీస్తే కాస్త ముందు వరుసలోనే ఉన్నారని చెప్పవచ్చు. బాలీవుడ్ స్టార్స్ సినిమాలు యాడ్స్ కాకుండా సోషల్ మీడియా ద్వారా రూ. కోట్లు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా సాయంతో నిత్యం తమ అభిమానులతో టచ్ లో ఉంటూ ఎప్పటి కప్పుడు సినిమా అప్డేట్స్ అందించడంతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం ఇన్‎స్టాగ్రామ్‎ వాడుతున్నారు.

అలా ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కు దాదాపు మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా. తన అందం, అభినయంతో ప్రస్తుతం బాలీవుడ్‎లో పాటు హాలీవుడ్ లోనూ అదరగొట్టేస్తోంది. ప్రియాంక చోప్రాకు ఇన్ స్టాగ్రామ్ లో 89.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె (Priyanka Chopra) తర్వాత షారుక్ ఖాన్ రూ. 80 లక్షల నుండి కోటి వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

వారి బాటలోనే ఆలియా భట్ కోటి రూపాయలు, శ్రద్ధా కపూర్ రూ.1.18 కోట్లు, దీపికా పదుకొనే రూ.1.5 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్, దీపికను మించి ప్రియాంక చోప్రా సంపాదించడం విశేషం. ఇటీవల ప్రియాంక చోప్రా అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్’లో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఆ తర్వాత మరో అమెరికన్ మూవీ ‘లవ్ ఎగైన్’లో సామ్ హ్యూగమ్ సరసన నటించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ మూవీ షూటింగ్ తో తాను బిజీగా ఉంది. తన కమిట్ అయిన సినిమాలు షూటింగ్ దశలో ఉండడం వల్ల తన కజిన్ పరిణితి చోప్రా పెళ్లికి తాను హాజరు కాలేకపోయింది. పరిణీతి పెళ్లికి రాకపోవడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రియాంక చోప్రా చాన్నాళ్ల తర్వాత ‘జిలే జరా’ అనే బాలీవుడ్ మూవీ లోనూ నటిస్తోంది. ఫర్హాన్ అక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus