Priyanka Chopra: మరోసారి కలర్‌ గురించి మాట్లాడిన ప్రియాంక!

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా.. మనం ఆమె గురించి ఇలా ఘనంగా చెప్పుకుంటున్నాం, ప్రపంచం కూడా అదే అంటోంది. అయితే ఇదంతా ఇప్పుడు. మరి ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో? అంటే కచ్చితంగా ఇంత రెస్పాన్స్‌ లేదనే చెప్పాలి. మన దగ్గర సంగతి అటుంచితే.. విదేశాల్లోనూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. వాటి గురించి వీలైనప్పుడల్లా చెబుతూ ఉంటుంది ప్రియాంక. తాజాగా మరోసారి నాటి విషయాలు గుర్తు చేసుకుంటూ.. కెరీర్‌ను ఎలా ఈ స్థాయికి తీసుకొచ్చిందో చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి ఆమె మాటలు వైరల్‌గా మారాయి.

ప్రపంచస్థాయిలో చాలా వేగంగా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. నటిగా, నిర్మాతగా, రచయిత్రిగా, గాయకురాలిగా, వ్యాపారవేత్తగా.. ఇలా చాలా రకాలుగా ప్రియాంక చోప్రా మనకు తెలుసు. ఇక అందం గురించి వస్తే.. ఆమె అందానికి ఫిదా అయ్యి అందాల కిరీటమే వచ్చింది. ఆ తర్వాత కుర్రకారు గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె శరీర రంగు మీద అవాకులు, చెవాకులు వినిపించేవి. ఆ క్రమంలో ఆమె మనసు గాయపడేలా చాలామంది వ్యాఖ్యలు చేసేవారట.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో బ్లాక్‌ క్యాట్‌, డస్కీ బ్యూటీ అంటూ కొందరు నన్ను విమర్శించేవారు అంటూ నాటి రోజుల్ని మళ్లీ గుర్తుచేసుకుంది ప్రియాంక. అయితే ఆ సమయంలో తన కంటే మంచి రంగున్న నాయికలు చాలామందితో తనను తాను పోల్చుకునేదట. వారి కంటే నేను గొప్ప నటినే అని నా భావనతో జీవితంలో ముందుకెళ్లిందట. ఆ విమర్శల్ని పట్టించుకుని అక్కడే ఆగిపోయుంటే.. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదేమో అని చెప్పింది ప్రియాంక.

దాంతోపాటు పారితోషికం విషయంలోనూ ప్రియాంక స్పందించింది. నటిగా కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో హీరోల పారితోషికంలో పది శాతం కూడా దక్కేది కాదని.. పారితోషికం విషయంలోనూ వివక్ష గురించి బాధపడేదాన్ని అని చెప్పుకొచ్చింది. అయితే స్టార్‌ హీరోయిన్‌ అయ్యాక.. ఎక్కువ పారితోషికం అందుకున్న నటీమణుల జాబితాలో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత హాలీవుడ్‌కి వెళ్లి గ్లోబల్‌ స్టార్‌ అయ్యింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus