రాజమౌళి దర్శకత్వంలో గ్లోబ్ ట్రాటర్ గా రూపొందుతున్న భారీ చిత్రం SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా , పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సుమారుగా 1000 కోట్ల బడ్జెట్ తో కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కాగా మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
రాజమౌళి సినిమాల్లో విలన్ క్యారెక్టర్ ని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం లో కూడా అదే తరహాలో “కుంభ” పాత్రను చూపించబోతున్నారు జక్కన్న. లాస్ట్ వీక్ లో విడుదల చేసిన “కుంభ” ఫస్ట్ లుక్ లో పృథ్వి రాజ్ చైర్ లో కూర్చుని , అగ్రెస్సివ్ లుక్ లో కనపడుతున్నాడు. కుంభ లుక్ ను కొందరు ట్రోల్ చేస్తుండగా , మరి కొందరు రాజమౌళి స్టామినాను ఒక లుక్ తో అంచనా వేయలేం అంటున్నారు.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగిన కథానాయిక “ప్రియాంక చోప్రా”. గ్లోబల్ గా తన నటనతో మంచి పేరు కూడా తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతానికి SSMB 29 లో నటిస్తుండగా , నవంబర్ 15 న జరిగే ఈవెంట్ కి సిద్ధమవుతున్నారు. అయితే రేపు (నవంబర్ 11న) ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నాడు రాజమౌళి అని సినీ వర్గాల సమాచారం. వరుస ఫస్ట్ లుక్స్ తో రాజమౌళి సినిమా పై బజ్ ను పెంచుతుండటంతో అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
