రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడం.. అలాగే ఆ మూవీ ఆమె నటన,గ్లామర్ కూడా ప్రేక్షకుల్ని ఆకర్షించడంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ‘ట్యాక్సీ వాలా’ సూపర్ హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి రెండో సినిమా అవకాశం త్వరగా రాలేదు. వరుస ఆఫర్లతో ఈమె బిజీ అవుతుంది అనుకుంటే అలా జరగలేదు. తర్వాత సత్యదేవ్ హీరోగా వచ్చిన ‘తిమ్మరుసు’ చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది.
కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఆ సినిమా లేట్ అయ్యి ఈ ఏడాది విడుదలైంది. ఆ చిత్రం మంచి విజయమే సాధించింది. లాయర్ పాత్రలో ప్రియాంక బాగానే చేసింది. అటు తర్వాత ఈమె నటించిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రం కూడా మంచి కమర్షియల్ హిట్ అయ్యింది. ఆ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పాటలు, ప్రియాంక గ్లామర్ కీలక పాత్ర పోషించడంతో ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. నిజానికి ఈ చిత్రంతోనే ప్రియాంక హ్యాట్రిక్ అందుకుంది కానీ..
‘ట్యాక్సీ వాలా’ తో వచ్చిన క్రేజ్ ను ఈమె నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి ఈమె మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది హ్యాట్రిక్ కనుక కొట్టి ఉంటే ఈమెకు బాగా ప్లస్ అయ్యి ఉండేది. కానీ గత వారం రిలీజ్ అయిన ‘గమనం’ చిత్రం ప్రియాంకకి అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి కలెక్షన్లు నమోదు కాలేదు. ‘అఖండ’ ఎఫెక్ట్ వలన జనాలు చిన్న సినిమాలని పట్టించుకోవడం లేదు.
నాగ శౌర్య ‘లక్ష్య’ కి కొద్దిపాటి ఓపెనింగ్స్ దక్కాయి కానీ…’గమనం’ ని జనాలు పట్టించుకోలేదు.విడుదల రోజున చాలా చోట్ల ఈ చిత్రం షోలు కూడా ఆపేసారు.పైగా ఈ చిత్రంలో శ్రీయ నటనకి మంచి అప్లాజ్ వచ్చింది కానీ ప్రియాంక జవాల్కర్ ను పెద్దగా పట్టించుకోలేదు. మొత్తానికి ఈ అమ్మడికి మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందని చెప్పాలి.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!