Priyanka Jawalkar: క్రికెటర్ తో ప్రేమాయణం.. స్పందించిన ప్రియాంక జవాల్కర్!

ప్రియాంక జవాల్కర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘టాక్సీ వాలా’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత ‘తిమ్మరుసు’ ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి చిత్రాలతో బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ వరుస గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న ఈమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె ఓ రెస్టారెంట్ లో తన లవర్ తో కూర్చొని ఉన్నట్టు ఊహాగానాలు వినిపించాయి.

ఆమె లవర్ మరెవరో కాదు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్. ప్రియాంక జవాల్కర్ కు ఎదురుగా కూర్చున్న వ్యక్తి అతనే అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియాలో వీరు ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ఈ విషయం పై కూడా గతంలో వీరి పై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే తాజాగా వీటి పై స్పందించిన ప్రియాంక జవాల్కర్.. ఆ ఊహాగానాలు అంతా అబద్ధం అన్నట్టు చెప్పుకొచ్చింది. ప్రియాంక మరోసారి ఆ ఫోటోని షేర్ చేస్తూ..

“ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి ఫోటో… అక్కడ మేము ఫోటో షూట్ చేస్తున్న తరుణంలో మాకు ఓ పనిలో సాయం చేయడానికి వచ్చాడు. అయితే అతను నా బాయ్‌ఫ్రెండ్‌ అంటూ వార్తలు వస్తుండటంతో ‘ఏంటి సంగతని’ మా అమ్మ అడుగుతోంది. దయచేసి ఇలాంటి కామెంట్స్ రాయడం ఇక ఆపండి అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక జవాల్కర్.

ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఏ సినిమాలు లేవు. గత ఏడాది ఈమె నుండి 3 సినిమాలు వచ్చాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఈమె నుండి వచ్చిన ఆఖరి చిత్రం ‘గమనం’ కావడం విశేషం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus