Bigg Boss5 Telugu: తన లవ్ సీక్రెట్స్ నిర్మొహమాటంగా చెప్పిన ప్రియాంక..!

బిగ్ బాస్ హౌస్ లో తొలిప్రేమని పంచుకునే టాస్క్ లో భాగంగా పార్టిసిపెంట్స్ వారి హృదయాల్లో ఉన్న మరపురానీ ఆ ప్రేమని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక్కడ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ తనలో ప్రేమ ఎలా చిగురించింది అనేది చాలా ఆసక్తికరంగా చెప్పింది. ప్రియాంక మాటల్లో ఆమె కథని విన్నట్లు అయితే.., ” లవ్ బెలూన్ పై రవి అని రాసి.. రవి అని పిలవడం నాకు ఇష్టం ఉండక అబ్బాయి అబ్బాయి అనేదాన్ని. రవి చాలా అందగాడు. ఒక ఫంక్షన్ లో నేను అబ్బాయిని చూశాను. మంచి అబ్బాయి. నేను సిగ్గుపడేదాన్ని. అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లనే. నాకు బాగా క్లోజ్ అయ్యాడు.

నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. అందరితో ఉండాలి అని చెప్పాడు. 6 సంవత్సరాలు మేము రిలేషన్ షిప్ లో ఉన్నాం. కానీ, నువ్వుంటే నాకు ఇష్టమని ఎప్పుడూ చెప్పలేదు. ఎక్కడికైనా కలిసి వెళ్లేవాళ్లం. అక్కకి పెళ్లి అయిన తర్వాత నాకు బాధ్యతలు తీరిపోయిన తర్వాత నేను వెళ్లి జెండర్ ఛేంజ్ చేస్కుని వచ్చాను. కొన్ని నెలలు మాత్రమే తనకి కనిపించలేదు. ఆ తర్వాత కలిసినపుడు నువ్వుంటే నాకు చాలా ఇష్టమని చెప్పాను. బాగున్నావ్, అమ్మాయిలాగానే ఉంటావ్ అని రిలేషన్ లో ఉందాం అని చెప్పాడు. నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అంటూ ఆనందం పడ్డాను. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందామా అని అడిగితే ఓకే అని కూడా అన్నాడు.

కాకపోతే పెళ్లి అని అన్నప్పటినుంచీ డిఫరెన్సెస్ వచ్చాయి. తర్వాత ఇంటికొచ్చి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ చెప్పాడు. దీంతో నేను ఆనంద పడ్డాను. నీకు పెళ్లి అయితే నాకు హ్యాపీ అని అందరికంటే ఎక్కువ ఆనందం నాకే అని చెప్పాను. నీ వైఫ్ ని కూడా నేను సిస్టర్ అని పిలవచ్చు. మరి మనం కూడా పెళ్లి చేసుకుందామా అని అడిగేసరికి చాలా మాటలు అన్నాడు. నువ్వేమన్నా అమ్మాయివా.. నీకు నాకు పెళ్లేంటి..? మనకేమన్నా పిల్లలు పుడతారా..? రిలేషన్ లో ఉన్నాం అది చాలు అంటూ మాట్లాడాడు. నువ్వు హ్యాపీ నేను హ్యాపీ చాలు అనేసరికి నేను రిసీవ్ చేస్కోలేకపోయాను. నాకు మదర్ అవ్వాలని ఉన్నా ఏమీ చేయలేను. నేను అతను బండి వేస్కుని వెళ్తుంటే నేను వెంటపడ్డాను.

మళ్లీ ఒక్కసారి అడగాలనిపించి అడిగితే, నాకు పెళ్లి అని చెప్పి చెప్పినా కూడా ఎందుకు వినిపించుకోవట్లేదు.. అసలు నువ్వెవరో తెలుసా.. అంటూ నన్ను ఎవరైతే చిన్నప్పటి నుంచీ ఆ మాటని పదే పదే అనేవారో అలాంటి మాటని తను 200సార్లు అనేసరికి నాకు ఎంతో బాధకలిగింది అంటూ చెప్పింది ప్రియాంక. ఆ మాటలు చెప్పేసరికి భోరున ఏడ్చేసింది. నువ్వు ఇష్టపడినా పడకపోయినా నేను ఇష్టపడ్డాను కాబట్టి, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పింకీని తలుచుకో. నా లైఫ్ లోకి మళ్లీ రావద్దు అంటూ బెలూన్ ని గాల్లోకి వదిలేసింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus