Bigg Boss Telugu 5: సిరి అందుకే సేఫ్ అయ్యిందా..? పింకీ లో లేనిది సిరిలో ఉన్నది అదే..!

ఆదివారం రోజున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏడుగురు ఇంటిసభ్యులతో ఫన్ గేమ్ ఆడిస్తూనే ఎలిమినేషన్ ప్రక్రియని ప్రారంభించాడు కింగ్ నాగార్జున. ఇందులో భాగంగా ఫస్ట్ మానస్ ని సేఫ్ చేశాడు. బిగ్ బాస్ స్టేజ్ పైన బిగ్ బాస్ లెటర్స్ ని వెనక్కి తిప్పుతూ నాగార్జున చేతులమీదుగా మానస్ ని సేఫ్ అని ప్రకటించాడు. మానస్ సేఫ్ అవ్వడంతో వాళ్ల గ్రూప్ ఆనందంలో మునిగిపోయింది. ఇక సిరి, కాజల్, ప్రియాంకలు మాత్రమే మిగిలారు. ఈసారి అమ్మాయిల్లో ఎలిమినేషన్ ఉంటుందని అర్ధమైపోయింది. లాస్ట్ వీక్ రవిని ఎలిమినేట్ చేసినపుడు సోషల్ మీడియాలో ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని తీవ్రమైన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, ఈసారి కాజల్ ని ముందుగా సేఫ్ చేసి సిరిని ఇంకా ప్రియాంక ఇద్దరినీ మాత్రమే లాస్ట్ వరకూ ఉంచారు. దీంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా ఒక వైపు నుంచీ షణ్ముక్ సిరికోసం టెన్షన్ పడుతుంటే, మరోవైపు మానస్, సన్నీలు ప్రియాంక కోసం టెన్షన్ పడ్డారు. అయితే, ఇక్కడ సిరి సేఫ్ అయ్యేసరికి షణ్ముక్ ఆనందంలో మునిగిపోయాడు. ఇక ప్రియాంక సింగ్ భారమైన గుండెతో బిగ్ బాస్ హౌస్ నుంచీ వీడ్కోలు పలికింది. ఇక్కడే మానస్ ని హగ్ చేస్కుంటూ ఎన్నో మాటలు చెప్పింది. లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉండాలని కోరింది. అంతేకాదు, అందరం బయటకి వచ్చిన తర్వాత పార్టీ చేసుకుందామంటూ మాట్లాడింది.

ఇక ఎలిమినేషన్ లో ఓటింగ్ లో లీస్ట్ ఉన్న కారణంగానే ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. ఒక ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇన్ని వారాలు సేఫ్ అవుతూ వచ్చిందంటే అది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. తనకంటే వీక్ కంటెస్టెంట్స్ తో ఎప్పుడూ కూడా ఎలిమినేషన్ లో ఉండేది. అయితే, లాస్ట్ వీక్ రవికంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయని బిగ్ బాస్ టీమ్ ప్రకటించింది. కానీ, ఈసారి కాజల్ ని , సిరిని ఓవర్ టేక్ చేయలేకపోయింది. వారికంటే తక్కువ ఓట్లని పొందింది. అయితే, ఈసారి ప్రియాంకతో పాటు మానస్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు.

దీంతో మానస్ ఫ్యాన్స్ ఎక్కడా కూడా ఓట్లని చీల్చకుండా మానస్ కి వేశారు. లాస్ట్ టైమ్ మానస్ కెప్టెన్ గా ఉన్నప్పుడు మానస్ ఓట్లు అన్నీ కూడా ప్రియాంకకి వచ్చాయి. అలాగే, మరోవైపు షణ్ముక్ నామినేషన్స్ లో లేనపుడు షణ్ముక్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యూజ్ గా సిరికి ఓటింగ్ చేస్తున్నారు. దీంతో సిరి ఎప్పటికప్పుడు సేఫ్ అవుతూనే వస్తోంది. ఈసారి కూడా అదే జరిగింది. షణ్ముక్ నామినేషన్స్ లో లేకపోవడం, మానస్ ప్రియాంకతో పాటుగా నామినేషన్స్ లో ఉండటం అనేది ప్రియాంకని ఓటింగ్ లో లీస్ట్ లో నిలుచోబెట్టింది.

అందుకే, కేవలం మానస్ వల్లే ఇప్పుడు ప్రియాంక సింగ్ వెళ్లిపోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అందరూ. అంతేకాదు, ప్రియాంక సింగ్ గేమ్ పరంగా కూడా ఇప్పుడున్న వాళ్లకంటే ఎక్కువ ప్రభావం చూపి ఆడినది లేదని, టాస్క్ లలో కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేదని, మానస్ తో చిర్రుబుర్రులాడటం అనేది కూడా ఈవారం తన గేమ్ ని దెబ్బతీసిందని అంటున్నారు బిగ్ బాస్ వ్యూవర్స్. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus