Priyanka Singh: తన పెళ్లి గురించి ప్రియాంక సింగ్ ఏం చెప్పిందంటే..?

ఈ వెడ్డింగ్ సీజన్‌లో సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలంతా వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు.. మంచి ముహూర్తం చూసుకుని ఎంచక్కా తమకు నచ్చిన వారితో ఏడడుగులేస్తున్నారు.. ఇప్పటికే కొందరు కొత్త జీవితం ప్రారంభించగా.. మరి కొందరు నిశ్చితార్థాలు చేసుకుని పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.. ఇటీవలే ‘జబర్దస్త్’ రాకేష్, జోర్దార్ సుజాత ఓ ఇంటి వారయ్యారు.. తాజాగా ఆ లిస్టులోకి ‘బిగ్ బాస్’ బ్యూటీ ప్రియాంక సింగ్ కూడా చేరబోతుందని వార్తలు వస్తున్నాయి..

తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ప్రియాంక సింగ్ స్పందించింది.. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్‌లో ‘నా పెళ్లి జ్యువెలరీ షాపింగ్’ పేరుతో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది ప్రియాంక. తన పెళ్లి ఫిక్స్ అయ్యిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లి కోసమే నగల షాపింగ్ చేస్తున్నానని చెప్పింది. అందరూ తన పెళ్లి గురించి ఎదురుచూస్తున్నారని.. కాబోయే భర్త ఎవరని అడుగుతున్నారు కాబట్టి.. వీడియో చివర్లో తనక్కాబోయే భర్త ఎవరో చెప్తానని, ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది కూడా క్లారిటీ ఇస్తానని అంది..

వీడియో చివర్లో 2024 ఫిబ్రవరి 30న తన పెళ్లి అని, అందరూ తప్పకుండా రావాలని ఆహ్వానించింది. హైలెట్ ఏంటంటే ఫిబ్రవరి నెలలో 30వ తేదీ ఎలా ఉండదో.. ప్రస్తుతానికి తన లైఫ్‌లో పెళ్లి అనే కాన్సెప్ట్ లేదన్నట్టు హింట్ ఇచ్చింది.. ఇక ఈ నగల షాపింగ్ తన పెళ్లి కోసం కాదని, తన స్నేహితురాలి పెళ్లి కోసమని తెలిపింది. తన మ్యారేజ్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇది కేవలం ప్రాంక్ వీడియో మాత్రమే అని చెప్పుకొచ్చింది.

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. దీంతో మమ్మల్ని పిచ్చివాళ్లని చేశావంటూ నెటిజన్లు ప్రియాంక సింగ్ తీరుపై ఫైర్ అవుతున్నారు.. ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేస్తే.. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకున్నా కానీ ఎవరూ నమ్మరు అంటున్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus