Namitha: ధనుష్ హీరో అని చెప్పి నన్ను.. నమిత లేటెస్ట్ కామెంట్స్ వైరల్

  • May 23, 2024 / 02:41 PM IST

నమిత (Namitha) అందరికీ గుర్తుండే ఉంటుంది కదా..! శ్రీనువైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన ‘సొంతం’ సినిమాతో ఆమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘జెమినీ’ (Gemeni) ‘ఒక రాజు ఒక రాణి’ (Oka Raju Oka Rani) వంటి క్రేజీ సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఈమె సక్సెస్ కాలేకపోయింది. అందువల్ల తర్వాత ఈమెకు బడా సినిమాల్లో ఛాన్సులు లభించలేదు. దీంతో తమిళంలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా ఈమెకు మంచి ఛాన్సులు రాలేదు.

దీంతో డబ్బుల కోసమే అన్నట్టు వచ్చిన సినిమాని వచ్చినట్టు ఓకే చేసేసింది. అయితే ఈమె స్టార్ గా ఎందుకు ఎదగలేదు అనే విషయాల పై ఈమె పలు సందర్భాల్లో స్పందించింది. సరైన ప్రాజెక్టుల్ని ఎంపిక చేసుకోవడంలో తాను తడబడినట్టు తెలిపింది. అలాగే కెరీర్ ప్రారంభంలో ఓ నిర్మాత చేతిలో ఈమె దారుణంగా మోసపోయిందట.

నమిత మాట్లాడుతూ.. “2006 లో ధనుష్ (Dhanush) హీరోగా రూపొందిన ఓ సినిమా కోసం నన్ను అడిగారు.ధనుష్‌ సినిమాలో ఛాన్స్ కాబట్టి నేను కాల్షీట్స్ ఇచ్చాను. కానీ చివరికి ఆ సినిమా నిర్మాత కజిన్‌ ఆ సినిమాలో హీరోగా నటించడం జరిగింది. ఆ విషయం తెలుసుకుని చాలా అప్సెట్ అయ్యాను. వెంటనే ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశాను.

ఆ తర్వాత వేరే వాళ్ళతో ఆ సినిమాని కంప్లీట్ చేశారు. దీంతో నిర్మాతల మండలికి, నటీనటుల మండలికి నేను కంప్లైంట్ చేశాను” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus