జనవరి 18వ తేదీ నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తారక రామారావు సమాధి వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇకపోతే ఎన్టీఆర్ తన తాతయ్యకు నివాళులు అర్పించడానికి రాబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడ ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే
అయితే బాలయ్య మాత్రం అక్కడికి రాగానే ముందు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అన్నింటిని తీసేయమని చెప్పడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై తాజాగా నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ ఘాటు వద్ద ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని బాలయ్య చెప్పిన దాంట్లో తప్పు లేదని బాలయ్య కనుక అలా చెప్పారు నేను కనుక ఉంటే నా రియాక్షన్ మరోలా ఉండేదని ఈయన తెలిపారు .
ఎవరైనా కానీ చనిపోయిన వారి దగ్గర బ్రతికున్న వారి ఫోటోలను పెడతారా అంటూ ఈయన ప్రశ్నించారు. ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే వారికి ఏమాత్రం పని పాట లేదని అందుకే చనిపోయిన వారి ఘాట్ వద్ద బ్రతుకున్న వారి ఫోటోలను పెట్టారని ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాజకీయాల పరంగా ఎన్టీఆర్ ను అణిచివేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై కూడా స్పందిస్తూ..
ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయాలలోకి రావాలి అంటే ఆయనని ఎవరు అడ్డుకోరు కానీ ఆయనకు సినిమాలంటేనే ఆసక్తి తన చుట్టూ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు నిర్మాతలకు మంచి సినిమాలు ఇవ్వాలన్న తపనతో సినిమాలలో నటిస్తున్నారని, ఆయన రాజకీయాలలోకి వస్తే తనని ఆ పగలిగే శక్తి ఎవరికీ లేదని ఈ సందర్భంగా చిట్టిబాబు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!