Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

నటుడిగా, సినిమా కథల ఎంపిక విషయంలో తేజ సజ్జా తనెంత స్పెషల్‌ అనేది ఇప్పటికే చూపించేశాడు. కుర్ర హీరోలు అలాంటి కథలను ఎంచుకోవడానికి ఒకటి రెండుసార్లు ఆలోచించుకునే స్క్రిప్ట్‌లతో సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు చేయడం కాదు.. వాటిలో మంచి విజయాలు కూడా అందుకుంటున్నాడు. అయితే అతని మీద ఉన్న ఒకే ఒక కంప్లైంట్‌ సింపతీ గేమ్‌ ఆడతాడు అని. ‘హను – మాన్‌’ సినిమా విడుదల సమయంలో సింపతీ గేమ్‌ ఆడాడు అని మహేష్‌ ఫ్యాన్స్‌ అంటారు. మొన్నీమధ్య ‘మిరాయ్‌’ విడుదలకు ముందు కూడా ఇలాంటి కామెంట్లే వచ్చాయి.

Teja Sajja

ఇప్పుడు ఈ విషయమంతా ఎందుకు అనుకుంటున్నారా? తనను తొక్కేశారని ఎక్కువగా చెప్పే తేజ సజ్జా ఓ సినిమాలో హీరోయిన్‌ పాత్రను తొక్కేశాడు అనే విషయం బయటకు వచ్చింది. తేజ స‌జ్జా కెరీర్‌ ప్రారంభంలో చిన్న సినిమాలు కొన్ని చేశాడు. అందులో ‘అద్భుతం’ సినిమా కొటి. కరోనా –య లాక్‌డౌన్‌ సమయంలో ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. మ‌ల్లిక్ రామ్ రూపొందించిన ఈ సినిమాలో రాజశేఖర్‌ తనయ శివానీ రాజశేఖర్‌ హీరోయిన్‌గా నటించింది.

ఆ సినిమా విడుద‌ల‌కు ముందు ఫిలిం చాంబ‌ర్‌లో ఒక వివాదం నడిచింది. అప్పుడు దాని గురించి మాట్లాడినా ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఆ విషయం గురించి చిత్ర నిర్మాత మోగుళ్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారు. టీవీ ఆర్టిస్ట్‌ సుధీర్‌ హీరోగా ఆయన నిర్మించిన ‘గోట్‌’ సినిమా ప్రచారంలో భాగంగా తన పాత సినిమాల్లో వివాదాలు రేగిన అంశాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తన సినిమాలో హీరో, ఎడిట‌ర్ క‌లిసి 15 నిమిషాల‌కు పైగా నిడివి ఉన్న సీన్లు తీయించేశార‌ని చెప్పారు.

క‌రోనా – లాక్‌డౌన్‌ వ‌ల్ల‌ ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలో ర‌న్ టైం 2 గంట‌ల 21 నిమిషాలుగా ఉండగా.. కొన్ని రోజులకు అది 2 గంటల 4 నిమిషాలకు తగ్గిపోయిందని తెలిపాడు. ఏంఆ అని చూస్తే హీరోయిన్‌ ఉన్న కొన్ని సన్నివేశాలను సినిమా నుండి తొలగించేశారని తేలిందని చంద్రశేఖర్‌ రెడ్డి చెప్పారు. హీరోయిన్ డామినేష‌న్ ఉంద‌నే ఉద్దేశంతో హీరో అలా చేశాడ‌ని కూడా చెప్పారు. ఆ విషయంలో జీవిత రాజ‌శేఖ‌ర్ సీరియ‌స్ అయ్యార‌ని.. ఇష్యూను ఫిలిం ఛాంబ‌ర్ వ‌ర‌కు తీసుకెళ్లార‌ని గుర్తు చేశారు.

 మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus