Dil Raju: అప్పుడు బైలింగ్యువల్ మూవీ అన్నాడు.. ఇప్పుడు తమిళ్ సినిమా అంటున్నాడు..!

సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు చాలా ఉన్నాయని, అవి సాల్వ్ అయ్యే వరకు షూటింగ్ లు బంద్ చేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్‌ జనరల్‌ బాడీ తరుపున నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్లు నిలిపివేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే బంద్ అనేది పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈరోజు చాలా సినిమాల షూటింగ్స్ నిర్వహిస్తున్నారు.అందులో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారసుడు’(వరిసు) మూవీ కూడా ఒకటి.

అంతేకాదు ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్లో రూపొందుతున్న వెంకీ అట్లూరి-ధనుష్‌ ల ‘సార్‌’ షూటింగ్ కూడా యధావిధిగా జరుగుతుంది. ‘సార్’ సినిమాను పక్కన పెడితే ‘వారసుడు’ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ విషయం పై ఆయన్ని ప్రశ్నించగా.. ‘వరిసు’ అనేది తమిళ సినిమా. అందుకే షూటింగ్ జరుగుతుంది అంటూ ఆయన తోసిపుచ్చే ప్రయత్నం చేశాడు. ‘ప్రస్తుతం తెలుగు సినిమాల షూటింగ్లు మాత్రమే బంద్ , నేను ఎటువంటి తెలుగు సినిమా షూటింగ్ లు చెయ్యడం లేదు’ అంటూ దిల్ రాజు వివరణ ఇచ్చాడు.

నిజానికి అది బైలింగ్యువల్ మూవీ అని మొదలుపెట్టారు. అదే విషయం పై దిల్ రాజుని ప్రశ్నించగా ‘ఇప్పుడు తమిళ్ లో షూటింగ్ జరుగుతుంది. తెలుగులోకి డబ్ మాత్రమే చేస్తారు’ అంటూ జవాబిచ్చాడు. మొదటి నుండి అది బైలింగ్యువల్ మూవీ అంటూ దిల్ రాజు ప్రమోషన్ చేశాడు. ఇప్పుడు డబ్బింగ్ సినిమా అంటున్నాడు.

ఇలా నచ్చినట్టు ప్లేటు తిప్పడం దిల్ రాజుకు మాత్రమే సాధ్యమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క రాంచరణ్- శంకర్ ల చిత్రానికి సంబంధించి కూడా కొంత వర్క్ జరుగుతున్నట్టు వినికిడి. మరి దిల్ రాజు ఆ సినిమా విషయంలో ఏమంటాడో..అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus