Srikanth: ఆయుధ పూజ సాంగ్ షూట్ లో అందరికీ షాక్ ఇచ్చిన తారక్.!

జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిందే. ఎన్ని పేజీల డైలాగులైనా, ఎంత కష్టమైన డ్యాన్స్ స్టెప్ అయినా సింగిల్ టేక్ లోనే చేసేస్తాడు అని అందరూ తారక్ ను తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా “ఆర్ ఆర్ ఆర్”లో నాటు నాటు డ్యాన్స్ స్టెప్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా “దేవర” అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఎన్టీఆర్.

Srikanth

సినిమాలో మొదటి పాట అయిన “ఆయుధ పూజ”లో ఎన్టీఆర్ స్టెప్స్ కి ఆయన అభిమానులే కాక ప్రేక్షకులు అందరూ తెగ మురిసిపోయారు. ముఖ్యంగా బనియన్ నోట బెట్టుకుని ఎన్టీఆర్ మోకాలి మీద వేసిన స్టెప్ అనేది ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ సాంగ్ షూట్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు నటుడు శ్రీకాంత్ (Srikanth) .

“దేవర” సినిమాలో రాయప్ప పాత్ర పోషించిన శ్రీకాంత్ కూడా “ఆయుధ పూజ” పాటలో తారక్ తో పాటు కొన్ని ఫ్రేమ్స్ లో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని విన్నాను కానీ “దేవర” సెట్స్ లో చూసాను. పెద్ద పెద్ద డైలాగులు కూడా చాలా ఈజీగా చెప్పేసేవాడు. ఇక ఆయుధ పూజ పాట షూటింగ్ కి తారక్ అసలు ప్రాక్టీస్ చేయలేదు.

బ్యాగ్రౌండ్ డ్యాన్సర్స్ అందరూ వచ్చి చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తుండగా.. తారక్ మాత్రం సింపుల్ గా ఒకసారి స్టెప్ చూసి వెంటనే టేక్ అన్నాడు. నేను ఇది ఇప్పుడప్పుడే అవ్వదులే, చాలా టైమ్ పడుతుంది కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్న సమయంలో.. సింగిల్ టేక్ లో ఆ కష్టమైన డ్యాన్స్ స్టెప్ చేశాడు తారక్” అంటూ ఎన్టీఆర్ డ్యాన్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు శ్రీకాంత్. “దేవర 2” గురించి మాత్రం ఇప్పుడేమీ మాట్లాడలేనని, పార్ట్ 1 కంటే పదింతలు ఉంటుందని చెప్పుకొచ్చాడు.

చరణ్‌ వస్తున్నాడు.. వెంకీ రాడు.. ఈ క్లారిటీ ఓకే.. మరి టైటిల్‌ మారుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus