సుహాస్ (Suhas) హీరోగా మారి ‘కలర్ ఫోటో’ (Colour Photo) ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) వంటి సూపర్ హిట్లు కొట్టాడు. అతని ఫామ్ చూసి ఎంతో మంది దర్శక నిర్మాతలు కథలు రెడీ చేసుకుంటున్నారు. సుహాస్ హీరోగా రూపొందిన ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam) అనే థ్రిల్లర్ మూవీ రూపొందింది. సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), రాశి సింగ్ హీరోయిన్స్.
ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకాదరణ పొందాయి. సినిమాపై మంచి బజ్ అయితే ఉంది. కానీ ఈ చిత్రం మే 3 న రిలీజ్ కాబోతోంది. అదే రోజున అల్లరి నరేష్ వంటి క్రేజీ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క ఎలక్షన్స్ హడావిడి, ఎండలు…వంటి వాటి వల్ల ఎక్కువ శాతం ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు. ఇలాంటి టైంలో కాకుండా వేరే టైంలో ‘ప్రసన్నవదనం’ ని విడుదల చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయేమో కదా? అని నిర్మాతల్లో ఒకరైన జె ఎస్ మణికంఠని అడిగితే..
ఆయన ‘మా సినిమాకి 2 శాతం జనాలు వచ్చినా సూపర్ హిట్టే. ఎందుకంటే మాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. ప్రస్తుతం టేబుల్ ప్రాఫిట్స్ లో ఉన్నాం’ అంటూ ధీమాగా సమాధానం ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రసన్నవదనం’ ని ‘మైత్రి’ సంస్థ విడుదల చేస్తుండగా, కర్ణాటక వంటి ఏరియాల్లో ‘హోంబలే’ సంస్థ విడుదల చేస్తుంది.