Naga Vamsi, Trivikram: ప్రభాస్ త్రివిక్రమ్ కాంబోపై నాగవంశీ ఏమన్నారంటే?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన సూర్యదేవర నాగవంశీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను నిర్మిస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఇతర డైరెక్టర్లతో సినిమాలను నిర్మిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. స్వాతిముత్యం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగవంశీ త్రివిక్రమ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. త్రివిక్రమ్ ఇప్పటివరకు ప్రభాస్ చరణ్ లతో సినిమాలను తెరకెక్కించలేదనే సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా చేయాలని సాహో సినిమా టైమ్ నుంచి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్ అప్పటికే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారని త్రివిక్రమ్ తో ప్రపంచం మాట్లాడుకునే తరహా సినిమాను చేయాలని అనుకుంటున్నానని నాగవంశీ తెలిపారు. త్రివిక్రమ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసే రేంజ్ సినిమాను నిర్మించాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబోలో కూడా సినిమాను ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు.

అన్నీ సెట్ అయితే ఇతర స్టార్ డైరెక్టర్లతో సినిమాలను నిర్మించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నాగవంశీ తెలిపారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ కొత్తగా ఉంటుందని ఆయన తెలిపారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ మార్కెట్ రేంజ్ గురించి ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అస్సలు రాలేదని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడాలనుకునే ప్రేక్షకులకు స్వాతిముత్యం మంచి ఛాయిస్ అని ఆయన చెప్పుకొచ్చారు.

కొత్త పాయింట్ ను ఈ సినిమాలో డిస్కస్ చేశామని ఆయన వెల్లడించడం గమనార్హం. రాబోయే రోజుల్లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో హాలీవుడ్ రేంజ్ సినిమాలు తెరకెక్కనున్నాయని నాగవంశీ కామెంట్ల ద్వారా క్లారిటీ వచ్చింది. సినిమాసినిమాకు త్రివిక్రమ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus