కోవిడ్ కి ముందు.. ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అయ్యేది. కానీ కోవిడ్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రతి శుక్రవారం 2 నుండి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నార్మల్ డేస్ లో పర్వాలేదు. కానీ ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు మాత్రం.. థియేటర్లు షేర్ కి ఇబ్బంది అవుతుంది. పెద్ద బడ్జెట్ సినిమాలు ఎక్కువ థియేటర్లు దక్కించుకుంటే తప్ప సేఫ్ అవ్వలేని పరిస్థితి. పెద్ద సినిమాలకి ఓపెనింగ్ వీకెండ్ చాలా కీలకం.
అందుకే మేకర్స్ ఎక్కువ థియేటర్లు, టికెట్ రేట్లు కోసం ప్రభుత్వానికి రిక్వెస్ట్..లు పెట్టుకుంటూ వస్తారు. మరోపక్క ఆ పెద్ద సినిమాల పక్కన రిలీజ్ అయ్యే చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి అన్యాయం జరుగుతుంది అంటూ.. పెద్ద సినిమా మేకర్స్ ని తిట్టిపోస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. 2024 లో రెండు సార్లు ఇలా కార్నర్ అయిన పెద్ద నిర్మాతగా నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఉన్నాడు. ఉదాహరణకి.. ఈ ఏడాది ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా రిలీజ్ అయ్యింది.
పక్కన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ‘గుంటూరు కారం’ చిత్రానికి 90 శాతం థియేటర్స్ ఆకుపై చేసారంటూ, ‘హనుమాన్’ సినిమా మేకర్స్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఆ టైంలో నాగవంశీని, దిల్ రాజుని (Dj Tillu) చాలా మంది తిట్టిపోశారు. ‘హనుమాన్’ లో విషయం అంతంత మాత్రమే .. కానీ క్లైమాక్స్ వర్కౌట్ అయ్యింది. దానికి సింపతీ ఇంకా కలిసొచ్చింది. అందువల్ల ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇక తర్వాత దీపావళి టైంలో ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) రిలీజ్ అయ్యింది. పోటీగా ‘క’ (KA)రిలీజ్ అయ్యింది. ‘లక్కీ భాస్కర్’ కి కూడా నాగ వంశీనే నిర్మాత. ఈసారి కూడా నాగ వంశీ ఎక్కువ థియేటర్స్ ఆకుపై చేశారు, ‘క’ కి ఎక్కువ థియేటర్స్ ఇవ్వలేదు అంటూ మళ్ళీ నాగవంశీని తిట్టిపోశారు. దీంతో ఈరోజు ‘డాకు మహారాజ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో నాగ వంశీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా సినిమాలు పోటీగా ఉన్నప్పుడే అందరికీ కష్టాలు గుర్తుకొస్తున్నాయి.
ఈసారి నేను కూడా సింపతీ కార్డు వాడతా’ అంటూ నాగవంశీ సెటైర్లు విసిరారు. అయితే సినిమాలో విషయం లేకపోతే సింపతీ కార్డులు ఎందుకూ పనిచేయవు. ఇటీవల వచ్చిన ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy) సినిమా ప్రమోషన్స్ లో హీరో రాకేష్ వర్రే (Rakesh Varre).. మా చిన్న సినిమాలకి సెలబ్రిటీలు రారు, సపోర్ట్ చేయరు అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. అతని సినిమా ఆడలేదు. దీంతో దిల్ రాజు సెటైర్ వేశాడు కానీ.. వెళ్లి సినిమాకి సపోర్ట్ చేసింది అంటూ ఏమీ లేదు. ఇలాంటివి నాగ వంశీకి తెలియనివి ఏమీ కాదు.