SSMB28: మహేష్ – త్రివిక్రమ్ మూవీ పై నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!

సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్య దేవర నాగ వంశీ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఓ పక్క హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో రూపొందే సినిమాల నిర్మాణ పనులు చూసుకుంటూనే మరోపక్క తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రేమమ్ , భీష్మ, రంగ్ దే, వరుడు కావలెను, డీజే టిల్లు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నాగ వంశీ ఇప్పుడు ధనుష్ తో బైలింగ్యువల్ మూవీ సార్ , బట్టబొమ్మ, అనగనగా ఒక రాజు…

ఇలా 10కి పైగా సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ లిస్ట్ లో స్వాతి ముత్యం కూడా ఉంది. బెల్లంకొండ సాయి గణేష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. అక్టోబర్ 5 న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ మహేష్ – త్రివిక్రమ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మహేష్ – త్రివిక్రమ్ మూవీ గురించి అతను మాట్లాడుతూ.. ‘ మహేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.

ఆ సినిమాలకు థియేటర్స్ లో దక్కాల్సిన ఆదరణ దక్కలేదు అని నా అభిప్రాయం. అవే సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు జనాలు భీభత్సంగా చూశారు. మేము చేసే సినిమా ఆ రెండు సినిమాలను మించి ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు ఆ రెండు సినిమాలను దృష్టిలో పెట్టుకొని ధియేటర్ కు వచ్చే ప్రతి ఆడియన్ ఈ మాట చెబుతాడు ‘ అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus