NBK 109 : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ.!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ (Bobby) కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. బాలయ్య ఆ గ్లింప్స్ లో యమ స్టైలిష్ గా కనిపించాడు. ఫ్యాన్స్ కి ఆ గ్లింప్స్ మంచి కిక్ ఇచ్చింది. మరోపక్క ఇటీవల ఎన్నికల హడావిడి ముగించుకున్న బాలయ్య తిరిగి మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు.

అయితే ‘ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఏంటి?’ అనే క్వశ్చన్ ఫ్యాన్స్ లో ఉంది. దానికి కూడా ఆన్సర్ వచ్చేసింది. ఈరోజు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) ప్రీ రిలీజ్ వేడుక ఎన్.కన్వెన్షన్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఎక్కువగా హాజరయ్యారు. వాళ్ళ కోసం నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ ‘ఎన్.బి.కె 109’ గ్లింప్స్ చూశారు కదా అదిరిపోయింది.

జూన్ 10 కి కూడా ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. పూనకాలు వచ్చేస్తాయి ఒక్కొక్కరికీ’ అంటూ చెప్పుకొచ్చాడు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. కాబట్టి.. ఫ్యాన్స్ బాలయ్య సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వారికి కావాల్సిన అప్డేట్.. నాగవంశీ ఇలా ముందుగానే ఇచ్చేసినట్టు అయ్యింది. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం మే 31 న రిలీజ్ కాబోతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus