Naga Vamsi: దేవర సీక్రెట్స్ వెల్లడించిన నాగవంశీ.. తెర వెనుక ఇంత జరిగిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లలో సితార బ్యానర్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సితార బ్యానర్ లో నిర్మించబడే ప్రతి సినిమా విషయంలో నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే దేవర (Devara) సినిమాకు నాగవంశీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. దేవర సినిమా రిలీజ్ విషయంలో నాగవంశీ సరైన ప్లానింగ్ తో ముందడుగులు వేయడం సినిమాకు ఎంతో ప్లస్ అయింది. లక్కీ భాస్కర్ (Lucky Baskhar)  ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ దేవర కలెక్షన్స్ గురించి, ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు.

Naga Vamsi

దేవర రిజల్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హ్యాపీగా ఉన్నారని నాగవంశీ తెలిపారు. దేవర మూవీ జూనియర్ ఎన్టీఆర్ రెండున్నరేళ్ల కష్టం అని ఆయన పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు నేను సినిమా రికార్డుల విషయంలో మాట ఇచ్చానని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని నాగవంశీ పేర్కొన్నారు. సినిమాను బాగా రిలీజ్ చేస్తానని మాట చెప్పానని చెప్పినట్టు చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

దేవర కలెక్షన్లు పూర్తిగా జెన్యూన్ అని తొలిరోజు కలెక్షన్లకు ఎంజీలు (మినిమం గ్యారంటీ) యాడ్ అయ్యాయని బెనిఫిట్ షో కలెక్షన్ల వల్ల ఫస్ట్ డే భారీ మార్క్ కనిపించిందని తెలిపారు. దేవర హక్కులను తానే అడిగి తీసుకున్నానని నాగవంశీ చెప్పుకొచ్చారు. అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని ఆయన కామెంట్లు చేశారు.దేవర సినిమాకు 16 రోజుల్లో 509 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఫుల్ రన్ లో 550 కోట్ల రూపాయల మార్క్ ను ఈ సినిమా టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు 220 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దేవర సినిమా నిర్మాత నాగవంశీకి మంచి లాభాలను అందించింది. నాగవంశీ చేసిన రిస్క్ కు ఈ సినిమాతో మంచి ఫలితం దక్కింది. మిక్స్డ్ టాక్ తో కూడా దేవర బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసిందనే చెప్పాలి.

కొడుకు సినిమా కోసం తండ్రి మారాడు.. మరి అన్న సినిమా కోసం ఆయన..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus