Vishwambhara: కొడుకు సినిమా కోసం తండ్రి మారాడు.. మరి అన్న సినిమా కోసం ఆయన..!

‘విశ్వంభర’ (Vishwambhara)  సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా టీమ్‌ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది అని, పక్కాగా అనుకున్న సమయానికి వచ్చేస్తారు అని సందర్భం వచ్చినప్పుడల్లా టీమ్‌ చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సినిమాను వాయిదా వేశారు. తాము అనుకున్న డేట్‌ను ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాకు ఇచ్చేశారు. దీంతో ‘విశ్వంభర’ ఎప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. ఎందుకంటే టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు తప్పించి మిగిలిన సీజన్లలో ఒక వారం ఒక పెద్ద సినిమా మాత్రమే వస్తుంది.

Vishwambhara

ఆ లెక్కన ‘విశ్వంభర’ సినిమాకు ఎప్పుడు సింగిల్‌ డేట్‌ దొరుకుతుంది అనే ప్రశ్న మొదలైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే సినిమాను సమ్మర్‌లోనే తీసుకొచ్చే ఆలోచనలో యూవీ క్రియేషన్స్‌ ఉందట. దీనికోస మార్చి, మే నెలలను అనుకుంటున్నారట. రెండింటిలో ఏదో తేల్చి త్వరలో అనౌన్స్‌ చేస్తారట. ఒకవేళ సినిమా టీమ్‌ మార్చి నెలాఖరున సినిమాను తీసుకురావాలని అనుకుంటే.. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకు అనుకున్న డేట్‌ను చిరంజీవి (Chiranjeevi)  అడగాల్సి ఉంటుంది.

‘హరి హర..’ సినిమా చాలా ఏళ్లుగా ఈ సినిమా ఆగుతూ వస్తోంది. కాబట్టి ఇప్పుడు సినిమా వాయిదా వేయమని అడుగుతారా అనేదే ప్రశ్న. చిరంజీవి అడిగితే పవన్‌ టీమ్‌ నో చెప్పదు. మరి చిరంజీవి సినిమా టీమ్‌ అడుగుతారా అనేది చూడాలి. ఒకవేళ అప్పుడు వద్దు అనుకుంటే మే నెలలో సెంటిమెంటల్‌ డేట్‌ను ఓకే చేసుకుంటారు అని చెబుతున్నారు.

చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా వచ్చిన మే 9న తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే అంతా రెడీ అయిపోయింది.. రిలీజ్‌కి రెడీ అని చెబుతున్న టీమ్‌ ఇప్పుడు ఐదు నెలలు ఆగుతారా అనేదే ఇక్కడ ప్రశ్న. చూద్దాం ‘కొడుకు కోసం తండ్రి వెనక్కి తగ్గినట్టు..’ అన్న కోసం తమ్ముడు వెనక్కి తగ్గుతాడా అనేది చూడాలి.

తెరపైకి ఆగిపోయిన ప్రాజెక్ట్.. దేవర కలెక్షన్లతో నమ్మకం పెరిగిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus