Sharwanand: ఆ వార్తలకు చెక్ పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన నాగవంశీ డీజే టిల్లు, భీమ్లా నాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. భీమ్లా నాయక్ రిలీజ్ కు ముందే నిర్మాతలకు లాభాలను అందించగా సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ సక్సెస్ తో ఈ సినిమాకు పని చేసిన వాళ్లంతా సంతోషంలో ఉన్నారు. మరోవైపు శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మార్చి 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరగగా నాగవంశీ ఈ సినిమా ఈవెంట్ కు హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో శర్వానంద్ కు తాను బాకీ ఉన్నానని ఈ నిర్మాత చెప్పుకొచ్చారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టీజర్ చూసిన వెంటనే మూవీ హిట్ అవుతుందని శర్వానంద్ కు చెప్పానని నిర్మాత కామెంట్లు చేశారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని నాగవంశీ వెల్లడించారు.

ఈ ఏడాది ఎలాగైనా ప్లాన్ చేసి శర్వానంద్ కు ఉన్న బాకీని తీర్చాలని అనుకుంటున్నానని నాగవంశీ అన్నారు. కొన్నిరోజుల క్రితం శర్వానంద్ కు నాగవంశీకి విభేదాలు వచ్చాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. శర్వానంద్ హీరోగా నాగవంశీ నిర్మాతగా రణరంగం అనే సినిమా తెరకెక్కింది. రణరంగం సినిమా నాగవంశీకి 8 కోట్ల రూపాయల వరకు నష్టాలను మిగిల్చింది. అందువల్ల శర్వానంద్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25వ తేదీన విడుదల కాకుండా అడ్డుకున్నారని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆయన ఇబ్బందులు కలిగించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే నాగవంశీ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఈవెంట్ కు హాజరై ఆ వార్తలకు చెక్ పెట్టారు. త్వరలో శర్వానంద్ నాగవంశీ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus