Spirit Movie: యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ప్రభాస్.. నిర్మాత ప్రణయ్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ప్రణయ్ వైరల్ అవుతున్న వార్తలపై స్పందించి ఆ వార్తలకు చెక్ పెట్టారు. అదే సమయంలో స్పిరిట్ మూవీ గురించి అభిమానులకు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ తన సినీ కెరీర్ లో తొలిసారి స్పిరిట్ మూవీలో పోలీస్ డ్రెస్ లో కనిపించనున్నారని ప్రణయ్ అన్నారు.

సందీప్ రెడ్డి వంగా గత సినిమాలలో హీరోల పాత్ర ఎలా ఉంటుందో స్పిరిట్ సినిమాలో హీరో రోల్ కూడా అదే విధంగా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. స్పిరిట్ లో ప్రభాస్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపిస్తాడని 2024 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ప్రణయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్పిరిట్ సినిమాలో హీరోకు సంబంధించిన విషయాలను మాత్రమే చెప్పగలనని అంతకు మించి ఏం చెప్పలేనని ప్రణయ్ వెల్లడించారు.

ప్రణయ్ చెప్పిన ఈ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (Spirit) స్పిరిట్ సినిమా వేరే లెవెల్ లో ఉండనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ సీరియస్ రోల్ లో నటిస్తే సినిమా హిట్ అని ఆ సెంటిమెంట్ ప్రకారం స్పిరిట్ కూడా హిట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ స్పిరిట్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

2025 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. స్పిరిట్ మూవీ సంచలనాలు సృష్టిస్తుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus