జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా చంద్రు జీవిత కథ ఆధారంగా ఆయన తన జీవితంలో గిరిజనుల కోసం పోరాడిన కేసును ఆధారంగా తెరకెక్కించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా ద్వారా గిరిజనులు కష్టాలను వారికి జరిగిన అన్యాయాలను ఎంతో స్పష్టంగా చూపించారు. ఇలా ఈ సినిమాలో సూర్య నటనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందులో సూర్య న్యాయమూర్తి చంద్రు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా గత ఏడాది దీపావళి కానుకగా ఓటీటీ లో విడుదలైంది.
ఈ సినిమా విడుదలైన అనంతరం పెద్ద ఎత్తున ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోగా మరోవైపు పెద్ద ఎత్తున వివాదాలలో కూడా చిక్కుకుంది. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా అకాడమీ అవార్డును అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేశారు. తాజాగా గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జై భీమ్ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ క్రమంలోనే చిత్ర బృందం కూడా ఈ ఫెస్టివల్స్ లో పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జై భీమ్ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఈ క్రమంలోనే జై భీమ్ సినిమా సీక్వెల్ గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ న్యాయమూర్తి చంద్రు వాదించిన ఎన్నో కేసులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకదానిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా సీక్వెల్స్ చేయవచ్చు.
తప్పకుండా ఈ సినిమా సీక్వెల్ వస్తుందని, ఇందులో కూడా సూర్య హీరోగా నటిస్తారని దర్శకుడు జ్ఞానవేల్ తెలియజేశారు. ఇదే విషయాన్ని నిర్మాత రాజశేఖర్ వెల్లడించారు. అయితే ఈ సినిమా రావడానికి మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ ఆలస్యం కానుంది.