Ravinder: భార్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన రవీందర్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన లిప్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సీరియల్ నటి వి జే మహాలక్ష్మిని రెండవ వివాహం చేసుకోవడంతో వీరిద్దరు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇలా రెండవ వివాహం అనంతరం ఈ జంట తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమ పెళ్ళి ఫోటోలను షేర్ చేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ జంట పై భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.

ఇకపోతే ఈ జంట గత కొంతకాలంగా ప్రేమలో ఉండే అనంతరం వివాహం చేసుకున్నారు. కానీ రవీందర్ డబ్బు కోసమే మహాలక్ష్మి తనని పెళ్లి చేసుకుందంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే వీటిని మాత్రం పట్టించుకోకుండా ఈ జంట వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.ఇక పెళ్లి సమయంలో రవీందర్ మహాలక్ష్మికి పెద్ద ఎత్తున బంగారాన్ని కానుకగా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి తన భార్యకు ఖరీదైన బహుమతిని అందించి తన ప్రేమను చాటుకున్నారు.

ఈ క్రమంలోనే రవీందర్ తన భార్యకు ఖరీదైన కారును కానుకగా ఇవ్వడమే కాకుండా ఈ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన భార్య మహాలక్ష్మి పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవీందర్ తన భార్యకు బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ మోరిష్ గ్యారేజ్ కారును తన భార్య మహాలక్ష్మికి కానుకగా ఇచ్చారు.

ఈ కారు ఖరీదు సుమారు 32 లక్షల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ప్రస్తుతం మహాలక్ష్మి రవీంద్ర షోరూంలో ఈ కారు కొనుగోలు చేసిన సమయంలో దిగినటువంటి ఫోటోలు వీడియోలను షేర్ చేశారు.ఇలా తన భార్యకు ఖరీదైన కానుకను ఇవ్వడంతో మరోసారి తనపై ఉన్న ప్రేమను రవీందర్ చాటుకున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus