నిర్మాతకి చెందిన మాల్ సీజ్.. పెద్ద షాకే ఇది.. ఏమైందంటే?

రవితేజ నిర్మాతకి పెద్ద షాక్ తగిలింది. ఎవరు ఆ నిర్మాత..? ఏంటా కథ? అనే వివరాల్లోకి వెళితే.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు, నిర్మాత అయిన రాక్ లైన్ వెంకటేష్ అందరికీ సుపరిచితమే. తెలుగులో కూడా ఆయన సినిమాలు నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి 14 న అంటే ఈరోజు ఆయనకు చెందిన ఓ మాల్ ను బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) అధికారులు తాళం వేసి సీజ్ చేశారు. 2011 నుండి 2022-23 వరకు మాల్ మేనేజ్మెంట్ వారు బోర్డుకు చెల్లించాల్సిన పన్ను రూ.11.51 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపినా..

వారు చెల్లించకపోవడంతో,అసలు స్పందించకపోవడంతో.. వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పన్నులో సగం అయినా చెల్లిస్తే కానీ తిరిగి మాల్ ఓపెన్ అయ్యే అవకాశాలు లేవట. మరోపక్క అసలు మాకు నోటీసులు ఇవ్వకుండానే ఇలా మాల్ ను సీజ్ చేశారు అంటూ రాక్ లైన్ వెంకటేష్ టీం చెబుతుంది. ఇదిలా ఉండగా.. రాక్ లైన్ వెంకటేష్ కన్నడతో పాటు అనేక తెలుగు చిత్రాలను కూడా నిర్మించారు.

రవితేజతో ఆయన నిర్మించిన ‘పవర్’ సినిమా ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’, రజినీకాంత్ ‘లింగా’ ‘ఆటగదరా శివ’ వంటి క్రేజీ చిత్రాలను కూడా ఆయన నిర్మించడం జరిగింది. ఈ మధ్యనే ‘కాటేరా'(కన్నడ) అనే సూపర్ హిట్ సినిమాను కూడా ఆయన నిర్మించడం జరిగింది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus