Bro Movie: డైరెక్టర్ సాయి రాజేష్ కి బ్రో షూ గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ అదే కారణమా?

దర్శక నిర్మాత సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్‌కేఎన్‌ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఇలా డైరెక్టర్ సాయి రాజేష్ కు ఏకంగా బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ ఈయనకు కానుకగా ఇస్తూ సర్ప్రైజ్ చేశారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇలా ఈయనకు బ్రో సినిమాలోని పవన్ ధరించిన షూస్ గిఫ్ట్ గా ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ డైరెక్టర్ సాయి రాజేష్ కు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం బేబీ సినిమా అని చెప్పాలి.ఇటీవల ఫస్ట్‌ కాపీని చిత్ర యూనిట్‌ చూసింది. నిర్మాత ఎస్‌కెఎన్‌ ఈ సినిమా బాగా నచ్చేసిందట. ఆ ఆనందంతో దర్శకుడికి ఈయన ఈ షూస్ గిఫ్ట్ గా ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌ ‘బ్రో’ సినిమా పోస్టర్‌లో ఆయన వేసుకున్న షూస్‌ అందరినీ ఆకర్షించాయి. రెగ్యులర్‌ షూస్‌ లాగా కాకుండా.. డిఫరెంట్‌గా ఉండటంతో అందరి దృష్టి ఆ షూస్ పై పడింది.

ఇక ఈ షూస్ పారిస్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్‌ ‘బల్మైన్‌’ తయారు చేసిన షూస్‌ కావడం విశేషం. మరి ఈ బ్రాండెడ్ షూ ఖరీదు ఎంత అనే విషయానికి వస్తే…ఒకేసారి ఈ షూస్ రూ.1,06,870. కావడం విశేషం. ఇంతటి ఖరీదైన షూస్‌ను బేబీ సినిమా డైరెక్టర్‌ సాయి రాజేష్‌కు నిర్మాత ఎస్‌కెఎన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం సంతోషం వ్యక్తం చేశారు.

నా ప్రొడ్యూసర్‌ బ్రో ‘బేబీ’ సినిమా ఫస్ట్‌ కాపీ చూసి ఈ షూస్‌ను నాకు బహుమతిగా ఇచ్చారు. లవ్‌ యూ ఎస్‌కెఎన్‌. మళ్లీ ఇంత ధర పెట్టి షూస్‌ కొనాలన్న ఆలోచన కూడా చాలా భయంగా ఉంది’ అని సాయి రాజేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రానికి సాయి రాజేష్‌ దర్శకత్వం వహించారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus