‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మొదట్లో ఈ బ్యానర్లో రూపొందిన సినిమాలు బాగానే ఆడాయి. అప్పుడు వేరే సంస్థలతో టై-అప్ అయ్యి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది.. పీపుల్ మీడియా సంస్థ. అయితే ‘రామబాణం’ (Ramabanam) నుండి సోలోగా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. అక్కడి నుండి తీసిన ప్రతి సినిమా ప్లాప్ అయ్యింది. ఆర్ధికంగా వారిని నష్టాల్లోకి తోసేసింది. వీళ్ళు నిర్మిస్తున్న కొన్ని సినిమాలకి అయితే బిజినెస్ కూడా జరగని పరిస్థితి ఏర్పడింది.
TG Vishwa Prasad
ఈరోజు శ్రీవిష్ణు (Sree Vishnu) ‘స్వాగ్’ టీజర్ రిలీజ్ అయ్యింది. అది కూడా రకరకాలుగా ఉంది. అయితే ‘పీపుల్ మీడియా’ వారి హోప్స్ అన్నీ ప్రభాస్ తో చేస్తున్న ‘రాజాసాబ్’ (The Raja Saab)పైనే ఉన్నాయని స్పష్టమవుతుంది. ఈరోజు జరిగిన ‘స్వాగ్’ టీజర్ లాంచ్లో భాగంగా.. ‘మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి. ఇది కంటెంట్ ను నమ్మి చేసినట్టు ఉన్నారు?’ అంటూ ఓ రిపోర్టర్ టీజీ విశ్వప్రసాద్..ని ప్రశ్నించాడు. అందుకు టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad).. ‘మాకు డిజాస్టర్లు వచ్చాయి అంటున్నారు.
దానికి కొలమానం ఏంటి? ఆర్ధికంగా నష్టపోయామని అంటున్నారా? కంటెంట్ ను బట్టి అంటున్నారా? కంటెంట్ ప్రకారం అయితే ‘మనమే’ (Manamey) కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గత సినిమా(మిస్టర్ బచ్చన్) (Mr. Bachchan) ఫలితం ఊహించలేదు. ఆర్ధిక నష్టాలు గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ‘ది రాజాసాబ్’ వస్తుంది. మా నష్టాలు అన్నీ తీర్చేస్తుంది’ అంటూ ధీమాగా చెప్పుకొచ్చారు.