ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన వాకాడ అప్పారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ కు, నాకు మధ్య సైరా నరసింహారెడ్డి షూటింగ్ సమయంలో గ్యాప్ వచ్చి తాను బయటకు వచ్చానని జరిగిన ప్రచారంలో నిజం లేదని అన్నారు. చిరంజీవి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదని చిరంజీవి మనిషిని చూసి పేగులు లెక్కపెడతాడని చిరంజీవికి సినిమా అంటే ఫింగర్ టిప్స్ అని వాకాడ అప్పారావు పేర్కొన్నారు. కెమెరా మేన్ షాట్ తప్పుగా పెడుతున్నారంటే చిరంజీవి పక్కకు వెళ్లి మాట్లాడతాడని వాకాడ అప్పారావు పేర్కొన్నారు.
చిరంజీవి, చరణ్ ఎక్స్ ట్రార్డినరీ పీపుల్ అని వాకాడ అప్పారావు వెల్లడించారు. ఆచార్య సినిమా కోసం ఒక వారం పని చేశానని వాకాడ అప్పారావు పేర్కొన్నారు. చిరంజీవి, చరణ్ కు తానంటే విపరీతమైన గౌరవం అని వాకాడ అప్పారావు అన్నారు. తనకు చిరంజీవి 38 సంవత్సరాల నుంచి పరిచయం అని వాకాడ అప్పారావు వెల్లడించారు. చిరంజీవి, చరణ్ చాలా సౌమ్యులని మనుషులను చూసి వాళ్లు ఎలాంటి వాళ్లు అనే సంగతి సులువుగా గుర్తిస్తారని వాకాడ అప్పారావు అన్నారు.
నిర్మాత బాగుంటేనే కుటుంబాలు బ్రతుకుతాయని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు చేయాలని ఎక్కడ ఖర్చు పెట్టకూడదో అక్కడ ఖర్చు పెట్టకూడదని వాకాడ అప్పారావు పేర్కొన్నారు. తను పని చేసే సినిమాల విషయంలో అన్నీ తనకు తెలిసే జరుగుతాయని వాకాడ అప్పారావు వెల్లడించారు. వాకాడ అప్పారావు నిర్మాతగా పలు సినిమాలను నిర్మించగా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.