Balayya Babu: టాప్ హీరోల్లో బాలయ్య దూకుడు మామూలుగా లేదు..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘అఖండ’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇది పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్న మూవీలో నటిస్తాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రానికి నిర్మాతలు. ఇక దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో కూడా ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు.’షైన్ స్క్రీన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్టు భోగట్టా. ఇవి రెండు మాత్రమే కాదు బాలయ్య.. మరికొంత మంది నిర్మాతల దగ్గర కూడా అడ్వాన్స్ లు అందుకున్నట్టు సమాచారం.

అవి మరో నాలుగు ప్రాజెక్టుల వరకు ఉండొచ్చట. అంటే ‘అఖండ’ తర్వాత 6 ప్రాజెక్టులతో బాలయ్య బిజీ బిజీగా ఉండబోతున్నాడన్న మాట. ఇవి పూర్తవ్వడానికి మరో 3 ఏళ్ళు అయినా టైం పడుతుంది.ఇదిలా ఉంటే.. ఇంకా చాలా మంది దర్శకనిర్మాతలు బాలయ్యని సంప్రదిస్తున్నారట. అడ్వాన్స్ లు ఇచ్చి స్లాట్ లు బుక్ చేసుకోవడానికి వారు సై అంటున్నారట. మూడేళ్ళ టైం పట్టినా పర్వాలేదు అంటున్నట్టు సమాచారం. బాలయ్యకు ఇంత డిమాండ్ ఉందా? అని కొంతమంది ఆశ్చర్య పడొచ్చు.

3 డిజాస్టర్లు పడినప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఇది నిదర్శనం. ఇక ఇంత మంది నిర్మాతలు బాలయ్య కోసం ఎగబడడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. బాలయ్య ఓ టాప్ హీరో. ఆయనతో సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొడితే రెండింతల లాభాలు వస్తాయి. అలాగే ఆయన డెడికేషన్ కూడా సూపర్ అని చాలా మంది చెబుతుంటారు. ఫాస్ట్ గా సినిమాని పూర్తి చేయడానికి సహకరిస్తారు. డైరెక్టర్ ఏం చెప్పినా ఎదురు ప్రశ్నించరు. ‘మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్స్‌’, ‘ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’, ‘సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్’, ’14 రీల్స్ ప్లస్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వంటి సంస్థలతో పాటు రాజ్ కందుకూరి వంటి నిర్మాత కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారట.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus