Akhil: అఖిల్ సినిమాకి ఇద్దరు నిర్మాతలు మారారా?

‘వినరో భాగ్యము విష్ణు కథ’ తో (Vinaro Bhagyamu Vishnu Katha) ఓ డీసెంట్ సక్సెస్ అందుకొని దర్శకుడిగా తన టాలెంట్ చూపించాడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు. ఇప్పుడు అఖిల్ తో  (Akhil Akkineni) సినిమా సెట్ చేసుకున్నాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో …. ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నారు. నందు మొదటి సినిమా కూడా తిరుపతి బ్యాక్ డ్రాప్లోనే ఆడింది! సెంటిమెంట్ గా షూటింగ్ అక్కడి నుండే మొదలు కానుంది.

Akhil

Producers changed for Akhil Akkineni next film

ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని టాక్. నాగార్జునకి బాగా నచ్చిన సబ్జెక్ట్ ఇది అని సమాచారం. అఖిల్ కెరీర్లో 6వ సినిమాగా సెట్స్ పైకి వెళ్లనుంది ఈ ప్రాజెక్టు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ ప్రాజెక్టు రెండు సార్లు చేతులు మారిందని సమాచారం. వాస్తవానికి సాహు గారపాటి (Sahu Garapati) ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించాలని అనుకున్నారు. కానీ తర్వాత నాగార్జున (Nagarjuna) తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై నిర్మిస్తానని.. ఆ ప్రాజెక్టుని టేకప్ చేశారు.

కానీ కట్ చేస్తే.. ఇప్పుడు అది ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ వద్దకు వెళ్లినట్టు స్పష్టమవుతుంది. ఇప్పుడు నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాతగా సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్లో నాగవంశీ ఒక ట్వీట్ కూడా వేశారు. ఏప్రిల్ 8న ‘#AKHIL6’ అనౌన్స్మెంట్ ఉంటుందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. నాగవంశీ ఇప్పుడు ఫామ్లో ఉన్న ప్రొడ్యూసర్. కాబట్టి.. దీన్ని బాగా డీల్ చేస్తారు అనేది నాగార్జున నమ్మకం కావచ్చు.

ఎన్టీఆర్ అన్ని విషయాలకి క్లారిటీ ఇచ్చేసినట్టేగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus