Kanguva: ‘కంగువా’ నిర్మాత వల్ల.. సూర్య కూడా కార్నర్ అయిపోతున్నాడా?

సూర్య (Suriya) నటించిన ‘కంగువా’ (Kanguva)  చిత్రం నిన్న అంటే నవంబర్ 14 న విడుదలైంది. మొదటి టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమాపై హైప్ ఏర్పడింది. ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు డబుల్ అయ్యాయి. కానీ నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను 10 శాతం కూడా అందుకోలేదు. కంటెంట్ బాగున్నా.. కథనం చాలా ల్యాగ్ ఉండటం,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హెవీ డోసేజ్లో ఉండటం వల్ల..

Kanguva

ప్రేక్షకులు కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇక మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేస్తుందేమో అని భావించినా, ఆ ఫీట్ ను కూడా అందుకోలేకపోయింది ‘కంగువా’. రూ.40 కోట్ల లోపే మొదటి రోజు గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే నిర్మాతలు మాత్రం రూ.58 కోట్లు గ్రాస్ అని వేసుకున్నారు. వాటి సంగతి ఎలా ఉన్నా.. ‘కంగువా’ రిలీజ్ కి ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) ..’ ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది’ అంటూ ‘ఓవర్ ది టాప్’ కామెంట్స్ చేశాడు.

వాటి పై విమర్శల వర్షం కురిసింది. అయితే ఆ కామెంట్స్ ని సూర్య కూడా వెనకేసుకు రావడం జరిగింది. ‘డ్రీం అనేది పెద్దగా ఉంటే తప్పేముంది? ‘బాహుబలి 2’ (Baahubali 2) అయినా వెయ్యి కోట్లు కొట్టాలని వాళ్ళు చేసుండరు. ప్రోడక్ట్ పై ప్రేమతో చేసుంటారు. ‘కంగువా’ ని కూడా మేము ప్రేమతో చేశాం’ అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. ఇక ఈరోజు ‘కంగువా’ ఓపెనింగ్స్ గురించి నిర్మాత మాట్లాడుతూ.. ‘నిన్న నైట్ షోలు బాగా పికప్ అయ్యాయి.

టాక్ బ్యాడ్ అయితే ఆ ఫీట్ సాధ్యం కాదు కదా’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు సినిమాపై ఆడియన్స్ చేసిన కంప్లైంట్ అన్నిటినీ అతను తోసిపుచ్చాడు. సూర్య కెరీర్లో ఉన్న ప్లాప్ సినిమాలకి కూడా ఓ గౌరవం ఉంటుంది. నిర్మాత చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆ గౌరవం సన్నగిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు.

ఇలా అయితే కష్టమే వరుణ్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus