Varun Tej: ఇలా అయితే కష్టమే వరుణ్..!

మెగా హీరో వరుణ్ తేజ్ కి (Varun Tej) ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పాలి. అతను చేస్తున్న సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అవుతున్నాయి. ‘గని’ (Ghani) ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna)  ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine)  వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘మట్కా’ (Matka) కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయినట్టే. ఈ సినిమాలన్నిటికీ వరుణ్ తేజ్ తన బెస్ట్ ఇచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.

Varun Tej

‘మట్కా’ లో 4 లుక్స్ కోసం మంచి ఎఫర్ట్ పెట్టాడు. కానీ డైరెక్షన్లో లోపం ఉన్నప్పుడు.. హీరో ఎంత బెస్ట్ ఇచ్చినా..అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ‘మట్కా’ విషయంలో జరిగింది అదే.వరుణ్ మార్కెట్ కూడా కొంచెం డల్ అయ్యింది. వరుణ్ తేజ్.. ఇక ప్రయోగాలు పక్కన పెట్టి.. మంచి కమర్షియల్ సినిమాలు చేస్తే బెటర్ అనేది కొందరి అభిప్రాయం. ‘మట్కా’ తర్వాత వరుణ్.. మేర్లపాక గాంధీ  (Merlapaka Gandhi)  దర్శకత్వంలో ఓ హర్రర్ టచ్ ఉన్న సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ఇది రీమేక్ అని కొంతమంది అంటున్నారు. అయితే ఏ సినిమా రీమేక్ అనేది స్పష్టత లేదు. మరోపక్క రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వంలో ‘కిల్’ రీమేక్ చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ దానిపై కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. అలాగే ‘టచ్ చేసి చూడు’ (Touch Chesi Chudu)  దర్శకుడు విక్రమ్ సిరికొండతో (Vikram Sirikonda) వరుణ్ తేజ్.. ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించనుంది. మరి ఈ ప్రాజెక్టులు అయినా వరుణ్ తేజ్ ని ఫామ్లోకి తెస్తాయేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus