ఇప్పటివరకూ రిలీజ్ డేట్ కోసం హీరోలు కొట్టుకోవడం చూసి ఉంటాం, లేదా అన్నమాట నిలబెట్టుకోవడం కోసం నిర్మాతలు నానా కష్టాలు పడడం చూసుంటాం. కానీ.. ఫస్ట్ టైమ్ హీరోల తండ్రులు ఒక రిలీజ్ డేట్ కోసం దాదాపు ఒకరితో ఒకరు పోటీ పడడంతోపాటు.. ఒకరిపై మరొకరు నిందలేసుకొంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈ శుక్రవారం తెలుగులో “జయ జానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి” సినిమాలు విడుదలవుతున్నాయి. మూడూ ఒకేరోజు విడుదలవుతుండడం, మూడు సినిమాలకు దాదాపు సమానమైన క్రేజ్ తోపాటు మార్కెట్ కూడా కలిగి ఉండడంతో థియేటర్ల విషయంలో సమస్య తలెత్తింది.
“నేనే రాజు నేనే మంత్రి” తెలుగుతోపాటు తమిళ-మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో విడుదలవుతుండడంతో.. “లై” లేదా “జయ జానకి నాయక” పోస్ట్ చేయడం సబబని భావించిన డిస్ట్రిబ్యూటర్ల సదరు సినిమాల నిర్మాతలను సంప్రదించగా.. నిర్మాతలు ఒకే అన్నా కూడా హీరో ఫాదర్స్ సుధాకర్ రెడ్డి (నితిన్ తండ్రి), బెల్లంకొండ సురేష్ (బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి) ససేమిరా అనడంతో.. వేరే దారిలేక మూడు సినిమాలూ ఒకేరోజు విడుదలవుతున్నాయి. అలాగే.. సురేష్ బాబు, బెల్లంకొండ సురేష్, సుధాకర్ రెడ్డిలు ఎవరి స్థాయిలో వారు తమ తనయుడి సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరికేలా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగమే తెలియదు కానీ.. చాలారోజులుగా థియేటర్లలో మంచి సినిమాలు లేక అల్లాడిపోతున్న తెలుగు ప్రేక్షకులు మాత్రం మూడు మంచి తెలుగు సినిమాలు ఒకేరోజు విడుదలవుతుండడంతో.. ఏ రోజు ఏ సినిమాకి వెళ్లాలా అని ప్లాన్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. చూద్దాం ఈ మూడు సినిమాల్లో ఎవరు సూపర్ హిట్ సాధిస్తారో, యావరేజ్ తో సరిపెట్టుకొంటారో లేక ఫ్లాప్ అందుకోంటారో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.