Prabhas: ప్రభాస్ సినిమాల నిర్మాతల స్ట్రాటజీ ఇదేనా?

  • May 31, 2022 / 06:46 PM IST

స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రభాస్ కు పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు రావడానికి కారణమయ్యాయి. అయితే ప్రభాస్ డైరెక్టర్లుగా అనుభవం తక్కువగా ఉన్న సుజీత్, రాధాకృష్ణ కుమార్ లకు ఛాన్స్ ఇవ్వగా సాహో, రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కగా ఈ సినిమాల వల్ల నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే ప్రభాస్ సినిమాలు ఫ్లాపైనా నిర్మాతలకు పెద్దగా నష్టం రాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో నిర్మాతలు ధైర్యంగా సినిమాలను తెరకెక్కించడానికి కూడా అసలు కారణం వేరే ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయని బోగట్టా.

మరోవైపు ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ టాక్ తోనే అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తుండగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు కళ్లు చెదిరే రికార్డులను క్రియేట్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 75 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ భవిష్యత్తు సినిమాల రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus