కొందరు కథానాయికలు వేశ్యాలకంటే దారుణంగా ఉన్నారు.!

ఓ నాలుగైదు సినిమాల్లో కూడా నటించిన, ప్రేక్షకలోకంలో కనీసం 10% కూడా గట్టిగా గుర్తించని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అయిన అమ్మాయి చేస్తున్న సిగ్గులేని కామెంట్స్ పుణ్యమా అని ఇండస్ట్రీ చెడ్డపేరు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు లేరు అని అందరూ బాధపడుతున్న తరుణంలో దర్శకనిర్మాతలు, కథానాయకులపై ఇలాంటి ఎలిగేషన్స్ రావడం వల్ల భవిష్యత్ లో ఒక్క తెలుగమ్మాయి కూడా ఇండస్ట్రీలోకి రావడానికి భయపడేస్థాయి పరిస్థితి ఏర్పడింది. కొన్ని పనికిమాలిన యూట్యూబ్ చానల్స్, పలు నిజాయితీ, విలువలు లోపించిన న్యూస్ చానల్స్ సదరు దిగజారిన మహిళను పట్టుకొని ప్రత్యేక షోలు ఏర్పాటు చేసి ఆమెకు పబ్లిసిటీ ఇవ్వడంతోపాటు తమ పాపులారిటీ పెంచుకోవడం కోసం చేస్తున్న నీచమైన కార్యక్రమాల వలన సినిమా మీద కనీస స్థాయి అవగాహన లేనివాడు కూడా ఇండస్ట్రీ గురించి అసహ్యంగా మాట్లాడుకోవడం మొదలెట్టాడు.

అయితే.. ఇప్పటివరకూ ఇండస్ట్రీకి చెందిన వారెవరూ ఈ ఇష్యూపై స్పమిద్మ్చలేదు. కానీ ప్రముఖ నిర్మాత జ్ణానవేల్ రాజా సతీమణి నేహా ఈ రచ్చపై మరో యాంగిల్ లో స్పందించారు. పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గానూ వర్క్ చేసిన అనుభవమున్న నేహా.. “ఈ హీరోయిన్లు కూడా తక్కువేమీ తినలేదు, బాగా డబ్బున్న, పెళ్ళైన నిర్మాతలను, కథానాయకులను లైన్ లో పెట్టడం. వాళ్ళ ద్వారా స్టేటస్, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా కొందరు బ్రతుకుతున్నారు. ఇలాంటి హీరోయిన్ల వల్లే ఇండస్ట్రీ ఇలా తగలాడిపోతోంది” అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించింది. ఈవిడ స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. రియల్ లైఫ్ ఎక్స్ పీరియన్సా లేక అలా ఎవరినైనా చూసిందా అనే అనుమానాలు రాకమానవు. మొత్తానికి ఈ రచ్చల పుణ్యమా అని ఇండస్ట్రీ విలువలు రోజురోజుకీ పడిపోతున్నాయే తప్ప ఎవరికీ లాభం ఉండట్లేదు. దాసరి తరహాలో ఒక ఇండస్ట్రీ పెద్దమనిషి రంగంలోకి దిగి ఈ ఇష్యూస్ ని సెటిల్ చేయకపోతే.. ఇండస్ట్రీ అంటేనే బ్రోతల్ హౌస్ అని, ఫిలిమ్ నగర్ ను రెడ్ లైట్ ఏరియా అని అన్నా అంటారు జనాలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus