గతంలో బాలకృష్ణ డైలాగ్స్ ని కొన్ని సినిమాల్లో స్పూఫ్ లు చేస్తూ సంపూర్ణేష్ బాబు కి ఫోన్ చేసి మరీ వార్నింగ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 30 ఇయర్స్ పృథ్వి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్ని తీసుకుని స్పూఫ్ లు చేసాడు పృథ్వి. ఈ తరుణంలో ఆ హీరోల అభిమానులు కొంతమంది ట్రోల్ చేసినప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ సునీల్ హీరోగా వచ్చిన ‘జక్కన్న’ సినిమాలో పృథ్వి మరోసారి బాలయ్యను ఇమిటేట్ చేసాడు. అంతే.. బాలయ్య అభిమానులు ఆయన పై పై విరుచుకుపడ్డారు. అంతకు ముందు కూడా పృథ్వి అనేక సినిమాల్లో బాలయ్యను ఇమిటేట్ చేసినప్పటికీ ఈ సినిమాలో ఆయన ఇమిటేషన్ .. వారిని మరింత ఇరిటేట్ చేసినందుకే అలా ఫైర్ అయ్యారని స్పష్టమైంది. దీంతో పృథ్వి వెంటనే ఆ విషయం పై క్లారిటీ ఇచ్చి … క్షమాపణలు చెప్పాడు కూడా..!
ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదలైన ‘సాహో’ టీజర్ లోని డైలాగ్ ను.. ఆది హీరోగా వచ్చిన ‘బుర్రకథ’ ట్రైలర్లో పృథ్వితో స్పూఫ్ చేయించారు. అయితే ఇలా ఇమిటేట్ చేయడం ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కడ ఇరిటేట్ అయ్యి మళ్ళీ పృథ్వి పై విరుచుకుపడతారో అని ముందుగానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘డై హార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్ .. దర్శకుడు సరదాగా పెట్టాడు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. టీజర్ లో డైలాగ్ చూసి ఏదేదో ఊహించుకోవద్దు. కథలో నాది ముఖ్యమైన పాత్ర. ఇలాంటి విషయాలని ముందుగా చెప్పేస్తేనే బెటర్. ప్రభాస్ ని కించపరిచేలా మా సినిమాలో ఎటువంటి సీన్స్ ఉండవు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ‘ఏదేమైనా పృథ్వి చాలా బయపడినట్టున్నాడు. అందుకే ఇలా జాగ్రత్త పడుతున్నాడు’.. అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు.