‘ఆకాశం నీ హద్దురా’ అమెజాన్ ముచ్చట తీర్చింది.. కానీ?

ఎయిర్ డెక్క‌న్ వ్యవస్థను స్థాపించిన గోపీనాథ్ జీవిత క‌థతో రూపొందింది ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం.సూర్య హీరోగా సుధ కొంగ‌ర డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటిటిలో విడుదలయ్యింది. అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో నేరుగా అమెజాన్ లో విడుదలైన ‘పెంగ్విన్’ ‘వి’ ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. కోట్లకు కోట్లు పెట్టుబట్టి పెట్టి ఆ చిత్రాల హక్కులను కొనుగోలు చేశారు అమెజాన్ వారు.

అంతేకాదు ఓ రేంజ్లో ప్రమోషన్ కూడా చేసారు.వ్యూయర్ షిప్ ను బట్టి ఆ సినిమాలు సేఫ్ అయ్యి ఉండొచ్చు కానీ.. ప్రేక్షకులను మాత్రం సంతృప్తిపరచలేదనే చెప్పాలి. వీటి కారణంగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది.ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తమిళ్ తో తెలుగు, మలయాళం వంటి భాషల్లో క్రేజ్ ఉన్న సూర్య సినిమా ఓటిటిలో విడుదలవ్వడం అంటే మాటలు కాదు.

అందుకే మొదటి షో నుండే ఎగబడి చూస్తున్నారు ప్రేక్షకులు. దాంతో ఈ చిత్రానికి మౌత్ టాక్ చాలా బాగుంది. దీపావళి సెలవలు కూడా ఉన్నాయి కాబట్టి.. ఈ వీకెండ్ మొత్తం కలుపుకుని ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం.. అదిరిపోయే వ్యూయర్ షిప్ ను నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందనే చెప్పాలి. అమెజాన్ ముచ్చటను ఈ చిత్రం తీర్చింది కానీ… ఇంత మంచి చిత్రాన్ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చెయ్యలేకపోయామే అనే అసంతృప్తి మాత్రం ప్రేక్షకుల్లో ఉండిపోతుంది.

Click Here For ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus