సినిమా అయినా టెలివిజన్ అయినా.. ఆన్ స్క్రీన్ ఎంటర్‌టైన్ చేసే వాళ్ల జీవితాలు ఆఫ్ స్క్రీన్ చాలా వరకు అనుకున్నంత, ఊహించుకున్నంత గొప్పగా అయితే ఏమీ ఉండవు అనే సంగతి చాలామంది విషయాల్లో నిరూపితమైంది.. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన పంచ్ ప్రసాద్ ఆరోగ్యం గురించి గతకొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని హెల్త్ కండీ షన్ గురించి నూకరాజు మరో వీడియో రిలీజ్ చేశాడు.
ప్రసాద్‌కి గతకొంత కాలంగా కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. ఈ విషయాన్ని అతనే చాలాసార్లు చెప్పాడు. అంతేకాదు.. తన హెల్త్ గురించి తనమీద తానే పలుసార్లు కామెడీగా పంచులు కూడా వేసుకున్నాడు. ప్రతి వారం డయాలసిస్ చేయించుకుంటూనే షోలో పార్టిసిపెట్ చేస్తున్నాడు. కానీ ఇటీవల ఉన్నట్టుండి పరిస్థితి సీరియస్ అయింది. దీంతో ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఈమధ్య ఓ రోజు షూటింగ్ నుంచి ఇంటికి వచ్చి కాస్త జ్వరంగా ఉందని భార్య సునీతతో చెప్పాడు ప్రసాద్.
ఆ తర్వాత నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి వెళ్తే.. నడుము దగ్గర నుంచి ఎడమ మోకాలి వరకు చీము పట్టేసిందని డాక్టర్స్ చెప్పారు. దీంతో పూర్తిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తాన్ని కమెడియన్ నూకరాజు.. వీడియోగా తీసి పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్, అభిమానులు.. ప్రసాద్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెట్టారు. తాజాగా ప్రసాద్ ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇస్తూ.. యూట్యూబ్‌లో మరో వీడియో పోస్ట్ చేశాడు నూకరాజు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కాస్త కోలుకుంది..
స్టిక్ లేదా ఓ మనిషి సాయం తీసుకుని నడుస్తున్నాడని విజువల్ చూపించాడు. గత నాలుగైదు రోజుల నుంచి సెలైన్స్ ఎక్కిస్తున్నారని, ఇంకో నాలుగు రోజులు కూడా ఇలానే చేయాల్సి ఉందని నూకరాజు చెప్పాడు. ఇక హాస్పిటల్‌కి వెళ్లిన ప్రసాద్.. స్కానింగ్ కూడా చేయించుకున్నాడు. మరో వారం గడిచిన తర్వాతే ప్రసాద్ నడవగలిగే విషయం చెబుతామని డాక్టర్స్ అన్నారు. మరోవైపు ప్రసాద్ పూర్తిగా రికవరీ అయిన తర్వాత మరో వీడియో కూడా పోస్ట్ చేస్తానని చెప్పాడు నూకరాజు.. వీడియోలో తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ప్రసాద్ థ్యాంక్స్ తెలిపాడు.