Puneeth Rajkumar: పునీత్ అభిమానులకు అతడి భార్య రిక్వెస్ట్!
- November 8, 2021 / 10:38 AM ISTByFilmy Focus
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. చిన్న వయసులోనే గుండెపోటుతో ఆయన మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేరనే వార్త తెలిసి ఇప్పటికే పన్నెండు మంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వరుసగా అభిమానులు సూసైడ్ కి పాల్పడుతుండటంతో పునీత్ భార్య అశ్విని స్పందించారు. పునీత్ మరణం తమ కుటుంబానికి తీరని లోటని.. ఇలాంటి పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదని కోరుకున్నారు.
‘అప్పు’ లేడనే విషయాన్ని మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం.. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకు ఎప్పడూ రుణపడి ఉంటామని చెప్పారు. పునీత్ మన మధ్య లేకపోయినా.. మన గురించి ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. దయచేసి అభిమానులు ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దని ఓ ప్రకటనలో పేర్కొన్నారు అశ్విని. మరోపక్క పునీత్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్రలు సైతం ఈ విషయంలో అభిమానులను రిక్వెస్ట్ చేశారు.

ఎవరూ కూడా ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని కోరారు. అలానే అంత్యక్రియల దృశ్యాలను కూడా పదే పదే ప్రసారం చేయొద్దని మీడియాకు సైతం రిక్వెస్ట్ చేశారు.
వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!
















