పూజా కార్యక్రమాలతో ఆర్ట్ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 ఘనంగా ప్రారంభం

తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన దర్శకులు, నిర్మాతలు తీస్తోన్న చిత్రాలు విజయాన్ని సాధిస్తున్నాయి. కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ట్ మేకర్స్ సమర్పణలో మద్దుల మదన్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సౌజన్య కావూరి నిర్మిస్తున్న ఈ మొదటి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెం.1కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలె మణికొండలోని శివాలయంలో జరిగాయి.

ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ గారు, విరాజ్ అశ్విన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో పురాణపండ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. ‘సినీ రంగంలోకి వస్తోన్న కొత్త తరంలో కూడా ఎందరో ప్రతిభా సామర్ధ్యాలతో అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారని, ఏ విత్తనంలో ఎంతటి అద్భుత మహా వృక్షం దాగుందో తెలియకుండా విశ్లేషించకూడద’ని అన్నారు.

ముహూర్తపు సన్నివేశానికి హీరో రవితేజ మహాదాస్యంపై ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫర్‌గా నితిన్ రెడ్డి చిమ్ముల , ఎడిటర్‌గా అఖిల్ దేశ్‌పాండే పని చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus