Puri Jagannadh, Vijay: పూరి జగన్నాథ్‌తో విజయ్‌ దేవరకొండ హ్యాట్రిక్‌.. నిజమేనా?

ఓ దర్శకుడు, హీరో కలసి కెరీర్‌లో మూడు సినిమాల్లో నటించడమంటే ఒకప్పుడు చాలా చిన్న విషయం. అయితే నేటి కాలంలో ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పటి హీరోలు తీస్తున్న సినిమాల వేగం చూస్తే.. ఒకే దర్శకుడితో అన్నేసి సినిమాలు చూడలేం. అయితే ఒక దర్శకుడితో హీరో వరుసగా మూడు సినిమాలు చేస్తే.. వావ్‌ అని కచ్చితంగా అనాల్సిందే. ఇదే మాట మరోవైపు నుండి కూడా చూడొచ్చు. సంవత్సరానికి మహా అయితే రెండు సినిమాలు చేస్తున్న పెద్ద హీరో.. ఒకే దర్శకుడితో వరుసగా మూడు సినిమాలు అంటే.. మరోసారి వావ్‌ అనాల్సిందే.

పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ గురించే ఇదంతా చెబుతున్నాం అంటే షాక్‌ అవుతారా? కచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఓ దర్శకుడు – హీరో వరుసగా మూడు సినిమాలు అంటే పెద్ద విషయమే. అయితే నమ్మశక్యంగా లేని ఈ ప్రాజెక్ట్‌కి అంతా ఓకే అయ్యింది అంటున్నారు. ‘లైగర్‌’తో తొలిసారి కలిసిన పూరి – విజయ్‌ దేవరకొండ… ఇప్పుడు ‘జేజీఎం’ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే మూడో సినిమాను కూడా చేసేయాలని చూస్తున్నారు.

విజయ్‌ దేవరకొండకు ఇటీవల పూరి జగన్నాథ్‌ ఓ లైన్‌ చెప్పారట. ఆలోచన నచ్చడంతో ‘జేజీఎం’ అయ్యాక వెంటనే చేసేద్దాం అని చెప్పారట విజయ్‌ దేవరకొండ. ‘జేజీఎం’ అయిన వెంటనే ఈ మూడో ప్రాజెక్ట్‌ పనులు మొదలుపెట్టేయాలని చూస్తున్నారు. నిర్మాత ఎవరు అనే ప్రశ్న అవసరం లేదు అనుకుంటా. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌ మీద ఛార్మితో కలసి పూరి జగన్నాథ్‌ నిర్మిస్తారు అని ఈజీగా చెప్పేయొచ్చు.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన ‘లైగర్‌’ ఆగస్టు 25న పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్య పాండే నటిస్తోంది. బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్‌ కెరీర్‌లో ఇదే భారీ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత విజయ్‌ ‘ఖుషి’ వస్తుంది. ఆ తర్వాతే ‘జేజీఎం’ తీసుకొస్తారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus