సూసైడ్ చేసుకున్న పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్.. ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరు సాయి కుమార్. ఇటీవల హైదరాబాద్లోని దుర్గం చెరువులో దూకి అతను ప్రాణాలు తీసుకున్నాడు. అక్కడి స్థానికులు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేపట్టారు. వారు సేకరించిన వివరాల ప్రకారం.. సాయి కుమార్.. దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు.

తర్వాత వారి విచారణలో ఇతను అప్పుల ఊబిలో కూరుకుపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. భవిష్యత్తులో మంచి దర్శకుడు కావాలనే ఉద్దేశంతో సాయి కుమార్.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడట. కానీ ఆర్థిక పరిస్థితులు అతన్ని బలి తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. నిజానికి అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసే వారికి జీతాలు ఉండవు. ఉన్నా ఎక్కువ ఉండవు. భోజనం పెట్టి, పెట్రోల్ ఖర్చులు ఇస్తారంతే..! కేవలం దర్శకుడు చేసే పని నేర్చుకోవడానికి మాత్రమే అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా మంది చేరుతూ ఉంటారు.

స్క్రిప్ట్ వర్క్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయాలపై కూడా అవగాహన తెచ్చుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ పనికొస్తుంది. కానీ ఏళ్ల తరబడి అదే పని చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని సినీ ప్రముఖులు చెబుతుంటారు. సాయి కుమార్ సూసైడ్ ఇన్సిడెంట్ కూడా అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus