శివ.. తెలుగు చిత్ర పరిశ్రమకి వేగాన్ని ఇచ్చిన సినిమా. ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన చిత్రం. అందుకే మళ్లీ ఆ చిత్ర కాంబినేషన్లో మూవీ అనగానే తప్పకుండా ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచే హంగామా మొదలవుతుంది. అలాగే నిన్న ప్రారంభమైన రామ్ గోపాల్ వర్మ, నాగార్జున మూవీ అందరిని తనవైపు తిప్పుకుంది. టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్, స్టిల్స్‌కి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికపై పంచుకున్నారు. “28 సంవత్సరాల క్రితంశివ సినిమా నాని ఛేంజ్ చేసింది.
మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నా..” అంటూ నాగార్జున పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కి పూరీ జగన్నాథ్ వెంటనే స్పందించారు. ‘‘సార్.. శివ చిత్రం మా జీవితాలను మార్చేసింది. నాగార్జునగారు, వర్మగారు మరోసారి కలిసి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీరి కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బ్లస్టర్ చిత్రం రాబోతుంది. మేమంతా ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోని మా ఇంటిలా భావిస్తాం. ఆ గౌరవం, ప్రేమ అలానే ఉన్నాయి’’ అంటూ పూరి జగన్ రీ ట్వీట్ చేశారు. నాగార్జున అభిమానులు తమ ఆనందాన్ని లైకులు ద్వారా వెల్లడించారు.