Puri Jagannadh: పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి.. బాలయ్య ఫిక్స్ అయినట్టేనా..!

‘సింహా’ తర్వాత బాలకృష్ణ నటించే ప్రతి సినిమాలోనూ మేనరిజమ్స్ బోయపాటి స్టైల్ లోనే ఉంటున్నాయి. బాలయ్యతో సినిమా చేసే ప్రతి డైరెక్టర్ బోయపాటి స్టైల్లోనే బాలయ్యను ప్రెజెంట్ చేయాలని భావిస్తున్నాడు. అయితే పూరి జగన్నాథ్, క్రిష్ లు మాత్రం బాలయ్యను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ‘పైసా వసూల్’ ‘ఎన్టీఆర్ బయోపిక్’ లలో బాలయ్య డిఫరెంట్ గా కనిపిస్తారు. అయితే ‘గౌతమీపుత్ర..’ బాలయ్యకు అలవాటున్న చారిత్రాత్మక చిత్రంలాంటిదే.

ఇక ‘ఎన్టీఆర్ బయోపిక్’ అంటే ఎన్టీఆర్ ను బాలయ్య చాలా వరకు ఇమిటేట్ చేయడం వంటిదే. సో ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా బాలయ్యను ప్రెజెంట్ చేసిన ఘనత పూరి జగన్నాథ్ కే దక్కుతుంది. 60 ప్లస్ ఉన్న బాలయ్యని 30 ప్లస్ లా ‘పైసా వసూల్’ లో చూపించాడు పూరి. సో వీరి కాంబోలో ఇంకో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పూరితో సినిమా చేయాలని బాలయ్య కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

కానీ ఒక్కటే సమస్య.పూరి తాను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చెయ్యాలి. ‘ఇస్మార్ట్ శంకర్’ ‘లైగర్’ కంప్లీట్ చేశాడు. వాటి ఫలితాలు ఏంటో కూడా అందరికీ తెలుసు. వీటి తర్వాత ‘జెజిఎం'(జన గణ మన) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు పూరి. ముంబైలో ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. 2023 ఆగస్టు 3న విడుదల చేయబోతున్నట్టు కూడా ఓపెనింగ్ డే రోజునే ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్టు గురించి కొన్నాళ్లుగా ఎటువంటి అప్డేట్ లేదు.

సో ఈ ప్రాజెక్టు అనఫీషియల్ గా ఆగిపోయినట్టే. ఈ క్రమంలో మొన్నామధ్య చిరంజీవి.. పూరి దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ పూరి వద్ద చిరు ఇమేజ్ కు తగ్గ కథ లేదు. అయితే తన వద్ద ఉన్న కథతో బాలయ్యని ఒప్పించాలని చూస్తున్నాడు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య ఏ దర్శకుడితో సినిమా చేసేది ఇంకా ప్రకటించలేదు. అందుకే పూరి తొందరపడుతున్నట్టు ఇన్సైడ్ టాక్.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus