Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ మనసులో ఆ ఐదుగురు!

‘లైగర్‌’ తర్వాత పూరి జగన్నాథ్‌ సినిమా ఏంటి అంటే.. ‘జీజేఎం’ అని చెప్పేస్తారు. ఆ తర్వాత ఏం సినిమా చేస్తారు అని అడిగితే.. చాలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. ఇంతవరకూ ఏ విషయంలోనూ క్లారిటీ లేదు. మొన్నీమద్య ‘లైగర్‌ 2’ ఉండొచ్చు అని చెప్పడంతో అది స్టార్ట్‌ చేస్తారా అని అనుకుంటున్నారు. మరికొందరైతే ‘ఆటో జానీ’ కథను మరోసారి బయటకు తీస్తారని అంటున్నారు. అయితే ఇవేవీ కావు ఆయన నెక్స్ట్‌ సినిమా బాలీవుడ్‌ది అవుతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి.

‘లైగ‌ర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘ఖాన్ త్ర‌యం’లోని హీరోలంద‌రితో ప‌నిచేయాల‌ని ఉంది. అలాగే ఈ తరం కుర్ర హీరోలతో కూడా సినిమాల చేయాలని అనుకుంటున్నాను. రణ్‌వీర్‌ సింగ్‌, ర‌ణ్‌బీర్ కపూర్‌ లాంటి యువ హీరోలతో కూడా సినిమాలు చేయాలి. వాళ్ల‌తో సినిమాలు చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చు. త్వ‌ర‌లోనే వారితోనూ సినిమాలు చేస్తా అని పూరి జగన్నాథ్‌ అన్నారు. దీంతో పూరి నెక్స్ట్‌ సినిమా ఏంటి అనే చర్చ ఇంకా కొనసాగుతోంది.

పూరి జగన్నాథ్‌ అనుకుంటున్నట్లు బాలీవుడ్‌లో ఆయన సినిమా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అక్కడి దర్శకులకు, నిర్మాతలకు ఏ సినిమాలు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏ సినిమా చేసినా ఒకప్పటిలా ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నారు. వచ్చిన సినిమా వచ్చినట్లు వెనక్కి వెళ్లిపోతోంది. దీంతో ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. సౌత్‌లో హిట్‌ అయిన సినిమా కథలు తీసుకొని వెళ్లి అక్కడ చేసినా జనాలు చూడటం లేదు. దీంతో సమ్‌థింగ్‌ మిస్సింగ్‌ అనుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో పూరి జగన్నాథ్‌ తనదైన శైలిలో హీరోయిజాన్ని అక్కడి హీరోలతో చూపిస్తే.. ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలి. అయితే అంతకంటే ముందు ఆయన తీసిన ‘లైగర్‌’ సినిమా అక్కడివారిని ఆకట్టుకోవాలి. పాన్‌ ఇండియా హిందీ సినిమాగా రూపొంది టాలీవుడ్‌లోకి కూడా వస్తున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం బాలీవుడ్‌ సీరియస్‌గా దృష్టిపెట్టింది అంటున్నారు. అదేంటి పాన్‌ ఇండియా హిందీ అంటున్నారు అనుకుంటున్నారా? మరి సినిమా అంతా హిందీలో తీసి తెలుగులోకి తీసుకొచ్చారని సోషల్‌ మీడియా టాక్‌. పాటలు అయితే అలానే తీశాం అని మొన్నీమధ్య విజయ్‌ కూడా అన్నాడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus