“పైసా వసూల్” తర్వాత పూరీ సినిమా అదే..
- August 31, 2017 / 07:59 AM ISTByFilmy Focus
ప్రస్తుతం “పైసా వసూల్” ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ రేపు సినిమా రిలీజావుతున్నా ఎలాంటి టెన్షన్ లేకుండా “నా సినిమా హిట్” అనే కాన్ఫిడెన్స్ తో అప్పుడే తన నెక్స్ట్ సినిమా కోసం సెట్టింగ్స్ చేసుకొంటున్నాడట. ఇంతకీ పూరీ నెక్స్ట్ సినిమా ఎవరితోనంటే.. ఆయన కుమారుడు ఆకాష్ తోనే. నిజానికి పూరీ స్వయంగా రాసుకొన్న కథతో, ఆయన బ్యానర్ లోనే ఆకాష్ ను హీరోగా లాంచ్ చేద్దామని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. అయితే.. మధ్యలో రాజ్ మదిరాజ్ అనే దర్శకుడు ఆకాష్ ను “ఆంధ్రా పోరి” అనే చిత్రంతో ఓ బుల్లి కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదనుకోండి అది వేరే విషయం.
అయితే.. పూరీ అర్జెంట్ గా తన కుమారుడ్ని కథానాయకుడిగా లాంచ్ చేసే పనుల్లో నిమగ్నమైపోయాడని తెలుస్తోంది. ఆకాష్ ఆల్రెడీ చాలా సినిమాల్లో నటించి ఉండడం, కెమెరా ఫియర్, డైలాగ్ డెలివరీలో ఇబ్బందులు లాంటివి ఏవీ లేకపోవడంతో.. పూరీ జగన్నాధ్ సినిమా కోసం వెయిట్ పెరుగుతూ కాస్త కండపట్టాడట. పూరీ లాంటి మాస్ డైరెక్టర్ తనకి ఇష్టమైన హీరోల కోసమే అద్భుతమైన డైలాగ్స్ రాస్తుంటాడు. అసలు పూరీ సినిమాలు హిట్ అయ్యేదే ఆ డైలాగ్స్ వల్ల. అలాంటిది స్వయాన తన కొడుకు కోసం పూరీ ఏ స్థాయి కథ-కథనం-డైలాగ్స్ రెడీ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. సో, ఇండస్ట్రీకి మరో వారసుడు కమ్ హీరో వస్తున్నాడన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















