సాధారణంగా పూరి జగన్నాథ్ తెరకెక్కించే చిత్రాల్లో కథ పెద్దగా ఉండదు. హీరోయిజం పైనే సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. హీరో బాడీ లాంగ్వేజ్ , డైలాగ్స్, రియల్ లైఫ్ పై పూరి స్టైల్ లో కొన్ని డైలాగులు.ఇలా ఆయన టేకింగ్ తో మమ అనిపించేస్తుంటాడు.అందుకే పూరి సినిమాల్లో హీరో బాగా హైలెట్ అవుతాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకైతే పూరి ఎప్పుడూ దూరమే. అప్పుడెప్పుడో రానా తో చేసిన ‘నేను నా రాక్షసి’ లో కొంచెం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ట్రై చేసాడు. కానీ ఆ సినిమా పెద్ద ఫ్లాపయ్యింది. ఆ చిత్రం రానా కెరీర్ కి కూడా ఉపయోగపడలేదు.
అయితే ఇప్పుడు మరోసారి `ఇస్మార్ట్ శంకర్` కోసం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ట్రై చేస్తున్నాడు. రామ్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో ఓ పాతబస్తీ కుర్రాడు చేసే దందా.. నేపథ్యంలో ఉంటుందట. ఇదే క్రమంలో ఓ విచిత్రమైన కాన్సెప్ట్‌ని కూడా వాడాడు. ఆ కాన్సెప్టే.. ‘బ్రెయిన్ ఎక్చేంజ్’. అంటే.. మెదళ్లను మార్చేయడం అన్నమాట. ఈ చిత్రంలో రామ్ అనుకోకుండా ప్రమాదానికి గురవుతాడు. ఈ నేపద్యంలో తన బ్రెయిన్ కూడా దెబ్బతింటుందట. అందుకే రామ్‌కి మరో బ్రెయిన్ అమరుస్తారట. అక్కడి నుండీ ఈ కథ మలుపు తిరుగుతుందని తెలుస్తుంది. అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి `డబుల్ దిమాఖ్` అనే పెట్టారట. మరి ఈ చిత్రమైనా హిట్టవుతుందో లేక ‘నేను నా రాక్షసి ఫలితాన్నిస్తుందో చూడాలి..!